Shraddha Kapoor : స్త్రీ-3 కూడా ఉంది .. రివీల్ చేసిన శ్రద్ధాకపూర్

ప్రస్తుతం శ్రద్ధాకపూర్ స్త్రీ 2 సక్సెస్ తో ఆనందంలో ఉంది. అయితే ఈ మూవీపై క్రెడిట్ వార్ నడుస్తోన్న వేళ శ్రద్ధా కపూర్ తన మనసులోని అభిప్రాయాలను బయటపెట్టింది. స్త్రీ 2 మూవీ సక్సెస్ వెనుక అందరి కృషి ఉందని ఆమె చెప్పుకొచ్చింది. అందులో త్వరలో రాబోతున్న స్త్రీ 3 ఎడిషన్ కూడా రూపొందుతోందని వెల్లడించింది. "కేవలం స్త్రీ 2 కోసమే సీక్వెల్ చేయకపోవటం ముఖ్యం. ప్రజలను థియేటర్లకు తీసుకురావడానికి, నిజమైన ప్రశంసలు సంపాదించడానికి మంచి కంటెంట్ అవసరం. సీక్వెల్ను ఎలా తీయాలి అనే విషయంలో ఆలోచన అవసరం. ఇందులో అన్ని ఆనందింపచేసే ఆంశాలు, మంచి నటులు, ఎంటర్ టైన్ చేసే డైలాగ్స్ ఉన్నాయి. ఇది అద్భుతమైన టీమ్ ఎఫర్ట్ అని నేను నమ్ముతున్నాను. అది నిజమో కాదో ప్రేక్షకులు నిర్ణయిస్తారు కదా? వారు వినోదం కోసం థియేటర్లకు వస్తారు. అందుకు వారికి తగిన ఆనందాన్ని ఇవ్వగలమని అనుకుంటున్నాను” అని ఆమె చెప్పింది. స్త్రీ మూవీ రాబోయే సీక్వెల్ కోసం తన ఉత్సాహాన్ని బయటపెట్టింది. "అమర్ సర్ తన వద్ద స్త్రీ 3 కోసం కథ ఉందని చెప్పినప్పుడు, అది అద్భుతంగా ఉంటుందని నాకు తెలుసు కాబట్టి నేను చాలా సంతోషించాను. కథ వినేందుకు తాను నీరిక్షణ చేయలేకపోతున్న అని చెప్పింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com