Pushpa 2 Item Song : 'పుష్ప-2' ఐటమ్ సాంగ్లో శ్రద్ధా?

Pushpa 2 Item Song : పుష్ప-2 ఐటమ్ సాంగ్లో శ్రద్ధా?
X

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ జీనియస్ సుకుమార్ కాంబోలో తెరకెక్కుతున్న చిత్రం ‘పుష్ప-2’. ప్రస్తుతం మూవీ షూటింగ్ చివరి దశలో ఉంది. ఓ సాంగ్, కొంత మేర క్లైమాక్స్ షూట్ మినహా మిగతా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా డిసెంబరు 6న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది. కాగా. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ నెట్టింట హల చల్ చేస్తోంది. సుకుమార్ సినిమాలో ఓ ఐటెం సాంగ్ కు విపరీతమైన క్రేజ్ ఉంటుంది. పుష్పలోని 'ఊ అంటావా మావా సాంగ్' ఎంత హిట్ అయిందో చూశాం. ఇప్పుడు రాబోతున్న పుష్ప–2 లోను ఐటం సాంగ్ ను ప్లాన్ చేశాడట సుక్కు. ఈ ఐటెం సాంగ్ కోసం మేకర్స్, బాలీవుడ్ స్టార్ బ్యూటీ శ్రద్ధా కపూర్‌ని తీసుకున్నారని తెలుస్తోంది. ఈ సాంగ్ కోసం శ్రద్ధా ఏకంగా రూ.4 కోట్ల రెమ్యునరేషన్ ఇచ్చినట్టు టాక్ నడుస్తుంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సిఉంది.

Tags

Next Story