Shree Rapaka: మ్యూజిక్ డైరెక్టర్‌ను ప్రేమించాను.. కానీ..: బిగ్ బాస్ బ్యూటీ

Shree Rapaka (tv5news.in)
Shree Rapaka: బిగ్ బాస్ తెలుగు ఓటీటీ.. నాన్‌స్టాప్‌గా ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేస్తోంది. చాలామంది బిగ్ బాస్ అభిమానులు మిస్ అవ్వకుండా బిగ్ బాస్ ఓటీటీని చూస్తూ.. తమ ఫేవరెట్ కంటెస్టెంట్స్‌కు ఓటు వేయడానికి అలవాటు పడ్డారు. అయితే ప్రేక్షకులను మెప్పించలేక బిగ్ బాస్ నాన్‌స్టాప్ నుండి రెండో వారం బయటికి వచ్చేసింది శ్రీ రాపాక. బయటికి వచ్చిన తర్వాత తన ప్రేమ గురించి మరోసారి బయటపెట్టింది ఈ బిగ్ బాస్ బ్యూటీ.
బిగ్ బాస్ హౌస్‌లో ఓ రోజు తమ జీవితంలో ప్రేమించిన వ్యక్తుల గురించి కంటెస్టెంట్స్‌ను అడిగాడు బిగ్ బాస్. ఆ సమయంలో కంటెస్టెంట్స్ అంతా వారి వారి ప్రేమకథల గురించి చెప్పుకొచ్చారు. అయితే శ్రీ రాపాక కూడా గతంలో తాను ఓ వ్యక్తిని ప్రేమించినట్టుగా తెలిపింది కానీ.. దాని గురించి మరిన్ని వివరాలు చెప్పలేదు. తాజాగా బిగ్ బాస్ నుండి ఎలిమినేట్ అయ్యి బయటికి వచ్చిన తర్వాత తన ప్రేమకథ గురించి వివరించింది శ్రీ రాపాక.
శ్రీ రాపాక ఓ మ్యూజిక్ డైరెక్టర్‌ను ప్రేమించిందట. అయితే ఇద్దరూ ఒకే ఫీల్డ్‌లో ఉంటే ఏ సమస్యలు రావనుకున్న శ్రీ రాపాక కొన్నా్ళ్లకే అతడికి దూరమయ్యింది. దానిని తాను లవ్ ఫెయిల్యూర్ అనను అని చెప్పుకొచ్చింది శ్రీ రాపాక. వారిద్దరు ఎప్పుడూ గొడవపడలేదని, విడిపోవాలి అనుకోలేదని తెలిపింది. కానీ కెరీర్ పరంగా వచ్చిన గ్యాప్ వల్ల వారు శాశ్వతంగా దూరమయిపోయారని చెప్పింది.
ఇప్పటివరకు శ్రీ రాపాక ప్రేమించిన వ్యక్తి నాలుగు సినిమాలకు మ్యూజిక్ డైరెక్టర్‌గా పనిచేశాడని తెలిపింది. అయితే విడిపోయిన తర్వాత కూడా వీరిద్దరు వేరేవారిని పెళ్లి చేసుకోకుండా ఉన్నారని స్పష్టం చేసింది. తనకు ఎలాంటి భర్త కావాలని అడగగా.. కమాండ్ చేసేవాడే భర్తగా కావాలని తన మనసులో మాట బయటపెట్టింది శ్రీ రాపాక. కమాండ్ చేసేవాడు ఉంటేనే లైఫ్ బోర్ కొట్టకుండా, కొత్తగా ఉంటుందని తన అభిప్రాయాన్ని బయటపెట్టింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com