సినిమా

Pushpa Hindi Version : 'పుష్ప' హిందీ వెర్షన్ : అల్లు అర్జున్‌కి డబ్బింగ్ చెప్పింది ఇతడే

Pushpa Hindi Version :ఇదిలావుండగా హిందీలో రిలీజైన పుష్ప ట్రైలర్ కి చక్కటి ఆదరణ లభించింది. అయితే అందులో ఉన్నది బన్నీ వాయిస్ కాదు..

Pushpa Hindi Version : పుష్ప హిందీ వెర్షన్ :  అల్లు అర్జున్‌కి డబ్బింగ్ చెప్పింది ఇతడే
X

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, దర్శకుడు సుకుమార్ కాంబినేషన్ లో పాన్ ఇండియా మూవీగా పుష్ప సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.. మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాని నిర్మిస్తోంది. డిసెంబర్‌ 17న తెలుగు, హిందీ, కన్నడ, మలయాళం, తమిళ భాషల్లో విడుదలకానుంది. ఇప్పటికే రిలీజైన ట్రైలర్ కి వీపరితమైన రెస్పాన్స్ వస్తోంది. దీనితో సినిమా పైన అంచనాలు భారీ స్థాయిలో నెలకొన్నాయి.

ఇదిలావుండగా హిందీలో రిలీజైన పుష్ప ట్రైలర్ కి చక్కటి ఆదరణ లభించింది. అయితే అందులో ఉన్నది బన్నీ వాయిస్ కాదు.. అయితే ఆ వాయిస్ ఎవరిదీ అని నెటిజన్లు సెర్చ్ చేయడం మొదలుపెట్టారు. అతని పేరు శ్రేయాస్‌ తల్పడే.. ఓం శాంతి ఓం సినిమాలో నటించాడు. దీనితో పాటుగాగోల్‌మాల్‌ రిటర్న్స్‌, గోల్‌మాల్‌ 3, హౌస్‌ఫుల్‌ 2, గోల్‌మాల్‌ అగైన్‌ వంటి చిత్రాలతో నటించి మెప్పించాడు. కేవలం నటుడుగానే కాకుండా నిర్మాతగా కూడా రాణిస్తున్నాడు.

ఇక పుష్ప హిందీ వెర్షన్ లో అల్లు అర్జున్ కి డబ్బింగ్ చెప్పినందుకు సంతోషంగా ఉందని అంటున్నాడు శ్రేయాస్‌ .. "పవర్‌ఫుల్‌, స్టైలిష్‌ స్టార్‌ అల్లుఅర్జున్‌ నటించిన 'పుష్ప' హిందీ వర్షెన్‌కు వాయిస్‌ ఇచ్చా. చాలా గర్వంగా, సంతోషంగా ఉంది" అని ట్వీట్ చేశాడు. ఇదిలావుండగా పుష్ప చిత్రం సెన్సార్ కూడా పూర్తి చేసుకుని U/A సర్టిఫికేట్ పొందింది. ఇక 'పుష్ప' ప్రీ రిలీజ్ వేడుకను డిసెంబర్ 12న హైదరాబాద్‌లోని యూసఫ్ గూడ పోలీస్ గ్రౌండ్స్‌లో జరపనున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది.


Next Story

RELATED STORIES