Shriya Saran: బేబీ బంప్‌తో డ్యాన్స్ చేస్తున్న శ్రియా.. వీడియో వైరల్

Shirya Saran: సినిమాల్లో నటిస్తూనే రష్యా నటుడు ఆండ్రీ కోస్కియుస్కోను రహస్యంగా పెళ్లి చేసుకున్న బ్యూటీ శ్రియ శరణ్. తెలుగు, తమిళ భాషల్లో స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన ఈమె ఇప్పటికీ పెద్ద సినిమాల్లో ఆఫర్లు అందుకుంటూనే ఉంది.
అయితే ఓ బిడ్డకు తల్లిగా ఉన్నా గ్లామర్ షో చేస్తూ నేటి తరం హీరోయిన్లకు ఏ మాత్రం తగ్గేదేలే అని హింట్ ఇస్తున్నట్లు ఉంటుంది. అలాగే ప్రాధాన్యం ఉన్న పాత్రల్లో కూడా నటించి మెప్పిస్తుంటుంది. రాజమౌళి ఆర్ఆర్ఆర్ లో ఆమె పాత్ర చిన్నదే అయినా ప్రేక్షకులకు గుర్తుండిపోయే పాత్ర. అజయ్ దేవగన్‌కు జోడీగా నటించి మెప్పించింది.
మొదటి లాక్ డౌన్ సమయంలో శ్రియ గర్భవతి అయింది. అయితే ఈ విషయం మీడియాకు లీక్ అవకుండా జాగ్రత్త పడింది. ఈ విషయాన్ని ఆమె గత ఏడాది వెల్లడించింది. 'గమనం' సినిమా ప్రమోషన్స్‌లో తన భర్త, పాపతో ఫ్యామిలీ లైఫ్‌ని ఎంజాయ్ చేస్తున్నానని చెప్పింది. ఆమె మాతృత్వ మధురిమల్ని ఆస్వాదిస్తున్నట్లు వివరించింది.
ఇదిలా ఉంటే శ్రియ తాజాగా తాను గర్భవతిగా ఉన్న సమయంలో బేబీ బంప్‌తో డ్యాన్స్ చేస్తున్న వీడియోను సోషల్ మీడియాలో విడుదల చేసింది. ప్రస్తుతం ఆ వీడియో వైరల్ అవుతోంది. తన తాజా చిత్రం మ్యూజిక్ స్కూల్ షూటింగ్ గోవాలో జరుగుతోంది. త్వరలో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com