సినిమా

Siri Shrihan: బాయ్‌ఫ్రెండ్‌ను ట్యాగ్ చేస్తూ సిరి పోస్ట్.. రెస్పాన్స్ ఇవ్వని శ్రీహాన్..

Siri Shrihan: బిగ్ బాస్ నుండి సిరి బయటికి వచ్చిన తర్వాత నుండి తనను కలవడానికి శ్రీహాన్ వెళ్లలేదు.

Siri Shrihan: బాయ్‌ఫ్రెండ్‌ను ట్యాగ్ చేస్తూ సిరి పోస్ట్.. రెస్పాన్స్ ఇవ్వని శ్రీహాన్..
X

Siri Shrihan: బిగ్ బాస్ అనేది కొందరి జీవితాలనే మలుపు తిప్పేస్తుంది అంటే చాలామంది నమ్మలేదు కానీ ఇప్పుడు షణ్నూ, సిరి జీవితాల్లోని పరిణామాలు చూస్తుంటే నిజమే అనిపిస్తుంది. ఈ ఇద్దరు యూట్యూబర్స్‌గా బిగ్ బాస్ హౌస్‌లోకి ఎంటర్ అయ్యారు. ముందు ఫ్రెండ్స్‌గా ఉన్నారు. ఆ తరువాత బెస్ట్ ఫ్రెండ్స్ అయ్యారు. కానీ ఫ్రెండ్స్ అని చెప్తూ వీరి ప్రవర్తన ప్రేక్షకులకు నచ్చలేదు అందుకే షణ్నూ చివరి వరకు వచ్చిన రన్నర్‌గానే మిగిలిపోయాడు.

బిగ్ బాస్ హౌస్‌లో సిరి, షణ్నూల ప్రవర్తన వారి పర్సనల్ లైఫ్‌పై కూడా ప్రభావం చూపింది. అందుకే అయిదు సంవత్సరాలుగా షణ్నూతో రిలేషన్‌లో ఉన్న దీప్తి సునయన.. తనకు బ్రేకప్ చెప్పేసింది. ఈ ఇద్దరి బ్రేకప్ న్యూస్ సోషల్ మీడియాలో చాలా వైరల్ అయ్యింది. అప్పటినుండి మరి సిరి, శ్రీహాన్‌ల పరిస్థితి ఏంటి అని చాలామంది నెటిజన్లు ఆలోచిస్తున్నారు.

తాజాగా శ్రీహాన్, సిరితో ఉన్న పర్సనల్ ఫోటోలన్నీ తన ఇన్‌స్టాగ్రామ్ నుండి డిలీట్ చేశాడు. ఇది బ్రేకప్‌కు సంకేతమేమో అనుకున్నారంతా. పైగా బిగ్ బాస్ నుండి సిరి బయటికి వచ్చిన తర్వాత నుండి తనను కలవడానికి శ్రీహాన్ వెళ్లలేదు. పైగా ఇటీవల శ్రీహాన్ నటించిన ఓ వెబ్ సిరీస్‌ను ప్రమోట్ చేస్తూ.. తనను ట్యాగ్ చేసింది సిరి. దీనికి కూడా శ్రీహాన్ ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వలేదు. దీంతో వీరి బ్రేకప్ ఖాయమని కొందరు నెటిజన్లు అనుకుంటున్నారు.Divya Reddy

Divya Reddy

TV5 News Desk


Next Story

RELATED STORIES