Shriya Saran: ఆసుపత్రిలో శ్రియ భర్త.. హెర్నియా అనే వ్యాధితో..

Shriya Saran: టాలీవుడ్‌లో ఎన్నో సంవత్సరాల నుండి బ్యూటీ క్వీన్‌గా వెలిగిపోతోంది శ్రియ. ప్రస్తుతం సినిమాల విషయంలో కాస్త స్పీడ్ తగ్గించినా కూడా అప్పుడప్పుడు ఒకట్రెండు చిత్రాల్లో కనిపించి అలరిస్తోంది. కొన్నేళ్ల క్రితం రష్యన్ టెన్నిస్ ప్లేయర్ ఆండ్య్రూ కొశ్చివ్‌ను పెళ్లి చేసుకున్న శ్రియ.. ప్రొఫెషన్‌కంటే ఎక్కువగా ఫ్యామిలీ లైఫ్‌పైనే దృష్టిపెట్టింది. తాజాగా తన భర్త ఆండ్య్రూకు హెర్నియా అనే వ్యాధి సోకిందని ఆసుపత్రిలో కూడా చేరాడన్న విషయాన్ని బయటపెట్టింది శ్రియ.
2018లో ఆండ్ర్యూను ప్రేమించి పెళ్లి చేసుకుంది శ్రియ. లాక్‌డౌన్‌లో తనకు ఓ పాప కూడా పుట్టింది. ఆ పాపకు రాధ అనే పేరు కూడా పెట్టుకున్నారు ఈ బ్యూటిఫుల్ కపుల్. అయితే సినిమాలకు కాస్త దూరంగా ఉన్నా కూడా సోషల్ మీడియాలో మాత్రం శ్రియ చాలా యాక్టివ్. తన ఫ్యామిలీతో వెళ్లిన వెకేషన్ ఫోటోలను ఎప్పటికప్పుడు తన ఫాలోవర్స్‌తో పంచుకుంటూ ఉంటుంది ఈ భామ. అలాగే తన భర్త ఆండ్ర్యూ ఆరోగ్య సమస్య గురించి కూడా ఇటీవల బయటపెట్టింది.
'ఆండ్య్రూకు హెర్నియా ఉంది. అందుకే తను రెండు నెలల నుండి రాధను కూడా ఎత్తుకోలేకపోతున్నాడు. ఇప్పుడు అదంతా గతం అయిపోయింది.' అంటూ తనకు వైద్యం చేసిన డాక్టర్‌కు, ఆసుపత్రికి థాంక్యూ చెప్పింది. అంతే కాకుండా హాస్పిటల్‌లో భర్తతో సంతోషంగా దిగిన ఫోటోను కూడా షేర్ చేసింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com