Shruti Haasan: స్టార్ హీరోలతో శృతి హాసన్.. అప్పుడు బాలయ్య, ఇప్పుడు చిరు..
Shruti Haasan (tv5news.in)
Shruti Haasan: కొంతమంది హీరోయిన్లు కెరీర్ ప్రారంభించి కొంతకాలమే అయినా.. సీనియర్ హీరోలతో నటించే ఛాన్స్ వస్తే వదులుకోవడానికి ఇష్టపడరు. ఒకప్పుడు సీనియర్ హీరోలతో నటిస్తే.. కెరీర్ ఎండ్ అయిపోయినట్టే అనుకుంటారు భామలు. కానీ ఇప్పుడు అలా కాదు. కథ నచ్చితే, పాత్ర నచ్చితే హీరో ఎవరు అన్న విషయాన్ని పట్టించుకోవట్లేదు భామలు. ఈ లిస్ట్‌లో శృతి హాసన్ ఒకరు.
కమల్ హాసన్ వారసురాలిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది శృతి హాసన్. కెరీర్ మొదట్లో తనకు ఒక హిట్ రావడానికే చాలా టైమ్ పట్టింది. అప్పటికే తనను అందరూ ఐరెన్ లెగ్ అని అవకాశాలు ఇవ్వడం తగ్గించేశారు. కానీ పవన్ కళ్యాణ్‌తో నటించిన 'గబ్బర్‌సింగ్' శృతి కెరీర్‌ను మలుపుతిప్పింది. అప్పటినుండి తనకు వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు.
కెరీర్ పీక్స్‌లో ఉన్న సమయంలోనే కొన్ని పర్సనల్ కారణాల వల్ల సినిమాలను దూరం పెట్టింది శృతి. మళ్లీ ఇప్పుడిప్పుడే బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ.. అందులోనూ చాలావరకు హిట్లు అందుకుంటూ.. మళ్లీ కెరీర్‌ను ఫామ్‌లోకి తెచ్చుకుంటోంది. ఇదే సమయంలో ఏ సీనియర్ హీరోతో నటించాల్సిన ఆఫర్ వచ్చిన శృతి కాదనడం లేదు.
ఇప్పటికే బాలకృష్ణ, గోపీచంద్ మలినేని కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం కోసం శృతిహాసన్‌నే హీరోయిన్‌గా ఎంపిక చేసింది మూవీ టీమ్. తాజాగా చిరంజీవి, బాబీ కాంబినేషన్‌లో తెరకెక్కనున్న చిత్రంలో కూడా శృతినే హీరోయిన్‌గా నటించనుందని ట్విటర్ ద్వారా కన్ఫర్మ్ చేశాడు చిరంజీవి. చిరు 154, బాలయ్య 107 సినిమాలతో త్వరలోనే శృతి టాలీవుడ్‌లో బిజీ కానుంది.
On this Women's Day, delighted to Welcome you on board @shrutihaasan
— Chiranjeevi Konidela (@KChiruTweets) March 8, 2022
You bring Woman Power to #Mega154 @MythriOfficial @dirbobby #GKMohan @ThisIsDSP pic.twitter.com/xYMaiQPpni
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com