Shruti Haasan : రిలేషన్ కోసం చూస్తున్నా.. శృతి హాసన్ కీలక కామెంట్స్

Shruti Haasan : రిలేషన్ కోసం చూస్తున్నా.. శృతి హాసన్ కీలక కామెంట్స్
X

కమల్ హాసన్ తనయ శృతి హాసన్ ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివే! తన సినిమా అప్డేట్స్ ను ఎప్పటికప్పుడు పాలోవర్లతో పంచుకుంటారు. అదే విధంగా తన ఇష్టా ఇష్టాలను సైతం షేర్ చేస్తూ ఉంటారు. ఇటీవల ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కీలక విషయం వెల్లడించారు. తాను ప్రస్తుతం సింగిలేనని, రిలేషన్ కోసం ఎదురు చూస్తున్నానంటూ బదులిచ్చింది. ప్రస్తుతానికి పనిలో ఎంజాయ్ చేస్తున్నట్టు చెప్పుకొచ్చింది ఈ ముద్దుగుమ్మ. తన కాబోయే భర్త ఎలా ఉండాలన్న విషయంపైనా

కుండ బద్దలుకొట్టిందీ భామ. ఆదర్శవంతమైన భాగస్వామి కావాలంటోందీ అమ్మడు. సరదాగా కూడా ఉండాలట. ఎప్పుడూ జోక్స్ వేస్తూ నవ్వించాలంటోంది. సృజనాత్మకంగా ఇతరులకు స్ఫూర్తి నింపే ఆలోచనలు కలిగి ఉండాలని చెప్పింది. ఆమె చేసిన ఈ వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. ఢిల్లీకి చెందిన ప్రముఖ డూడుల్ ఆర్టిస్ట్ శాంతను హజారికతో తాను ప్రేమలో ఉన్నట్లు నాలుగేళ్ల క్రితం ప్రకటించింది శృతి. అయితే ఆయనతో బ్రేకప్ చెప్పేసింది. ఈ విషయాన్ని కూడా తాను సోషల్ మీడియాలో షేర్ చేసింది.

Tags

Next Story