Shruti Haasan : శ్రుతి హాసన్ 15యేళ్ల ప్రస్థానం
సౌత్ లో హీరోల కొడుకులు హీరోలు అయినంత ఈజీగా హీరోల కూతుళ్లు హీరోయిన్లు కాలేరు. అందుకు అభిమానుల అంగీకారం కావాలి. ముందు హీరో ఒప్పుకోవాలి. ఒప్పుకున్నా అనేక ఆంక్షలు పెడతారు. డ్రెస్సింగ్ నుంచి స్టోరీ సెలెక్షన్ వరకు అంతా తమ పర్యవేక్షణలో ఉండేలా చూసుకుంటారు. ఆ మూసను బద్ధలు కొట్టిన హీరో కమల్ హాసన్. ఆ కారణంగానే ఆయన కూతురు, మోస్ట్ బ్యూటీఫుల్ అండ్ టాలెంటెడ్ శ్రుతి హాసన్ ఇప్పుడు ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో 15 ఇయర్స్ పూర్తి చేసుకుంది.
2009లో లక్ అనే బాలీవుడ్ మూవీతో హీరోయిన్ గా కెరీర్ మొదలుపెట్టింది శ్రుతి హాసన్. కమల్ కూతురుగా కాక ఇండివిడ్యువల్ లేడీగానే తను తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. ఈ క్రమంలో అందరు హీరోయిన్లలగే స్కిన్ షో చేసింది, లిప్ లాక్స్, ఇంటిమేట్ సీన్స్ అన్నీ చేసింది. కానీ ఎందుకో తనకు లక్ అంత సులువుగా రాలేదు. ఓ దశలో ఇంక తన పనైపోయింది అన్న కమెంట్స్ వచ్చాయి. ఆ కమెంట్స్ కు ఫుల్ స్టాప్ పెట్టింది.. గబ్బర్ సింగ్. పవన్ కళ్యాణ్ హీరోగా హరీష్ శంకర్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ బ్లాక్ బస్టర్ కావడంతో శ్రుతి హాసన్ కెరీర్ లో కొత్త ఇన్నింగ్స్ మొదలైంది. అప్పటి నుంచి రవితేజ 'బలుపు', ఎన్టీఆర్ 'రామయ్యా వస్తావయ్యా', అల్లు అర్జున్ 'రేసు గుర్రం', రామ్ చరణ్ 'ఎవడు', మహేష్ బాబు 'శ్రీమంతుడు', నాగ చైతన్య 'ప్రేమమ్'... వరుసగా బ్లాక్ బస్టర్స్ పడ్డాయి. అప్పటి నుంచి తనకిక వెనుదిగిరి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. ఈ మధ్య కాలంలో కూడా క్రాక్, వకీల్ సాబ్, వాల్తేర్ వీరయ్య వంటి సూపర్ హిట్ మూవీస్ తో సత్తా చాటింది. మరోవైపు సింగర్ గానూ ఆకట్టుకుంటూ, ఆల్బమ్స్ కూడా చేస్తూ తనలోని మరో యాంగిల్ ను చూపుతూ వస్తోంది.
ఇక రాబోయే రోజులన్నీ కూడా శృతి హాసన్ వే కావడం విశేషం. సలార్ తో ప్యాన్ ఇండియా రేంజ్ హిట్ అందుకున్న తను ఆ మూవీ సెకండ్ పార్ట్ లోనూ నటించబోతోంది. అలాగే లోకేష్ కనకరాజ్, రజినీకాంత్ కాంబోలో వస్తోన్న కూలీలో తనే కీలక పాత్రలో నటించబోతోంది. అడవి శేష్ తో డెకాయిట్, కేజీఎఫ్ స్టార్ యశ్ తో టాక్సిక్ మూవీస్ లో తనే హీరోయిన్. సో ఈ లైనప్ చూస్తోంటే శృతి హాసన్ మరో పదేళ్ల పాటు లైమ్ లైట్ లోనే ఉండబోతోందని అర్థం కావడం లేదూ. ఏదేమైనా మేల్ డామినేటెడ్ ఇండస్ట్రీలో నెపోకిడ్ గా వచ్చినా తనదైన ప్రతిభతోనే ఇన్నేళ్లుగా టాప్ హీరోయిన్ గా వెలుగుతోందనేది నిజం. మరి ఈ జర్నీ ఇలాగే కొనసాగాలని కోరుకుంటూ ఈ మల్టీ టాలెంటెడ్ బ్యూటీకి ఆల్ ద బెస్ట్ చెబుదాం.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com