Shyam Singha Roy: నానీ.. 'ఎగసెగిసిపడు అలజడి వాడే'.. లిరికల్ సాంగ్ రిలీజ్..

Shyam Singha Roy:నేచురల్ స్టార్ నాని కెరీర్ స్టార్టింగ్ నుంచి సినిమా సినిమా కి పరిణితి చెందిన యాక్టర్ గా వైవిధ్యమైన కథలతో ప్రేక్షకులను అలరిస్తూ ముందుకు వెళ్తున్నాడు. ఇటీవల 'టక్ జగదీష్' అనే ఫ్యామిలీ ఎంటర్టైనర్ తో పలకరించిన నాని.. 'శ్యామ్ సింగ రాయ్' సినిమా తో కొత్త కోణంలో కనిపించనున్నాడు.
నాని కెరీర్లోనే హయ్యెస్ట్ బడ్జెట్ మూవీ. హై ఓల్జేజ్ యాక్షన్ డ్రామా గా తెరకెక్కుతున్న ఈ సినిమా లోని మొదటి సాంగ్ రిలీజ్ చేసారు చిత్ర యూనిట్. మిక్కీ జె మేయర్ ఈ పాటకు మంచి ట్యూన్లు అందించారు. తెలుగు వెర్షన్‌కు కృష్ణ కాంత్(కె.కె) సాహిత్యం అందించారు.
'అరే ఎగసెగిసిపడు అలజడి వాడే శ్యామ్ సింగ రాయ్.. అరే తిరగబడిన సంగ్రామం వాడే..' అంటూ హీరో పాత్ర స్వభావం తెలియజేసెలా ఈ లిరిక్స్ సాగాయి. కాగితం కడుపు చీల్చే.. అన్యాయం తలే తెంచే.. అరే కరవాలంలా పదునా కలమేరా.. శ్యామ్ సింగ రాయ్' అంటూ సాగిన ఈ పాట శ్రోతలకు రోమాలు నిక్కబొడుచుకునేలా సాగింది.
రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో వస్తున్న శ్యాం సింగ రాయ్ చిత్రాన్ని కలకత్తా బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కించారు. పీరియాడికల్ అంశాలను ముడిపెడుతూ ఈ చిత్రాన్ని తీర్చిదిద్దారు దర్శకుడు. క్రిస్మస్ సందర్భాన్ని పురస్కరించుకుని డిసెంబర్ 24న తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ చిత్రాన్ని విడుదల చేయనుంది చిత్ర యూనిట్. ఈ చిత్రంలో సాయి పల్లవి, కృతి శెట్టి, మడోనా సెబాస్టియన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.
© Copyright 2023 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com