shyam singha roy teaser: టీజర్‌లోనే 'నానీ' పవర్ చూపించాడుగా..

shyam singha roy teaser: నేచురల్ స్టార్ నానీ నటించిన చిత్రం శ్యామ్‌సింగరాయ్. ఓ విభిన్నమైన కథాంశంతో తెరకెక్కుతోన్న చిత్రంగా పోస్టర్లు చూస్తే అర్థమవుతోంది. బెంగాలీ యువకుడి పాత్రలో నానీ అద్భుతమైన నటనను ప్రదర్శించినట్లు తెలుస్తోంది ఈ రోజు విడుదలైన టీజర్ చూస్తుంటే.
ఆసక్తికరమైన కథనం, అద్భుతమైన సాంకేతిక విలువలతో రూపొందుతున్న ఈ చిత్రం ప్రేక్షకుడిని మరో ప్రపంచానికి తీసుకెళుతుందనడంలో అతిశయోక్తి లేదు. రెండు విభిన్న కాలాల నేపథ్యంలో కథ సాగుతుంది. దేవదాసి వ్యవస్థ యొక్క మతపరమైన ఆచారాలకు వ్యతిరేరంగా పోరాడుతూ, ప్రస్తుత ప్రేమ కథను తెరపై ఆవిష్కరించారు దర్శకుడు రాహుల్ సంకృత్యాన్.
నాని బెంగాలీ భాషలో పలికిన డైలాగ్ టీజర్‌కే హైలెట్‌గా నిలిచింది. సాయిపల్లవి తన నటనతో, డ్యాన్స్‌తో ప్రేక్షకుల్ని మరోసారి మెస్మరైజ్ చేయనుంది. టీజర్‌లో నాని, కృతిశెట్టి లిప్‌లాక్ సీక్వెన్స్ ఆడియన్స్‌ని గిలిగింతలు పెడుతుంది.
సాను జాన్ వర్గీస్ సినిమాటోగ్రఫీ, మిక్కీ జె మేయర్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కథపై మరింత ఆసక్తిని రేకెత్తిస్తాయి. వెంకట్ బోయనపల్లి నిర్మిస్తున్న ఈ చిత్రం టీజర్ చూసి సినిమాపై అభిమానులు ఒక అంచనాకు వచ్చేస్తున్నారు. సిల్వర్ స్క్రీన్‌పై మరో అద్భుతమైన చిత్రాన్ని చూడబోతున్నాం అనే అభిప్రాయం అందరిలో నెలకొంది. నానీ 'శ్యామ్ సింగరాయ్' చిత్రం డిసెంబర్ 24న థియేటర్లలోకి రానుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com