Sid-Kiara: సిద్ధ్-కియారా వెడ్డింగ్‌కి ఎంత ఖర్చు పెట్టి ఉంటారో తెలుసా!!

Sid-Kiara: సిద్ధ్-కియారా వెడ్డింగ్‌కి ఎంత ఖర్చు పెట్టి ఉంటారో తెలుసా!!
Sid-Kiara: బాలీవుడ్ బ్యూటీఫుల్ కపుల్స్ సిద్ధార్థ్ మల్హోత్రా, కియారా అద్వానీ ఇటీవల జైసల్మేర్‌లోని సూర్యగఢ్ ప్యాలెస్‌లో అంగరంగ వైభవంగా వివాహం చేసుకున్నారు.

Sid-Kiara: బాలీవుడ్ బ్యూటీఫుల్ కపుల్స్ సిద్ధార్థ్ మల్హోత్రా, కియారా అద్వానీ ఇటీవల జైసల్మేర్‌లోని సూర్యగఢ్ ప్యాలెస్‌లో అంగరంగ వైభవంగా వివాహం చేసుకున్నారు. కొంతకాలంగా రహస్యంగా డేటింగ్‌లో ఉన్న ఈ జంట ఫిబ్రవరి 7న సన్నిహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు. వీరి పెళ్లి ఫోటోలు వైరల్ అయినప్పటి నుండి, ఈ వేడుకకు ఎంత ఖర్చుపెట్టి ఉంటారో అని అభిమానులు గుసగుసలాడుకున్నారు.

ఆయుష్ అనే ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్ వివాహ ఖర్చులను పంచుకున్నారు. "జైసల్మేర్‌లోని సూర్యగఢ్‌లో కియారా, సిద్ధార్థ్‌లు వివాహం చేసుకోవడానికి ఎంత ఖర్చు పెట్టి ఉంటారు అని ప్రశ్నతో పోస్ట్ ప్రారంభమైంది. ఆయుష్ పెళ్లి ఖర్చులను చెబుతూ.. "అతిథుల సంఖ్య - 150, రోజుల సంఖ్య - 2, గదుల సంఖ్య - 83, ఒక్కో గదికి రోజుకు- 30,000, భోజనాల సంఖ్య - 6, ఒక వ్యక్తికి భోజనం ధర - 5,000 , ఒక్కో అతిథికి బహుమతుల ధర - 10,000."

తర్వాత అతను మరింత విపులంగా.. "గదుల ధర - 30,000 * 83 * 2 = 49.8 లక్షలు, భోజన ఖర్చు - 150 * 6 * 5,000 = 45 లక్షలు, డెకర్ యొక్క సూచిక ధర - 40 లక్షల రూపాయలు, * 2 = ప్రయాణ ఖర్చు + వివిధ ఖర్చులు = 30 లక్షలు, బహుమతులు - 100 కుటుంబాలు * 10,000 = 1 కోటి. పెళ్లి మొత్తం ఖర్చు - 2,14,80,000 (సూచిక ధర)."

పోస్ట్ ముగించేముందు.. "లాజిస్టిక్స్, ఫోటోగ్రాఫర్, స్టాఫింగ్, సెక్యూరిటీ, మెహందీ, డిజైనర్ బట్టలు, ఆభరణాలు, ఇతర ఖర్చులు 20 లక్షల నుండి 20 కోట్ల వరకు ఉంటాయి. ఈ గణాంకాలు సూచనప్రాయంగా చెప్పినవి. ప్యాకేజీ మరియు సీజన్ ఆధారంగా మారవచ్చు. కానీ ఇలాంటి వివాహాన్ని నిర్వహించడానికి ఇంత మొత్తం కచ్చితంగా అవసరం.

Tags

Read MoreRead Less
Next Story