Sid Sriram: సిద్ధ్ శ్రీరామ్ హవా మామూలుగా లేదుగా.. ఒక్కో పాటకి రెమ్యునరేషన్

Sid Sriram: సిద్ధ్ శ్రీరామ్ హవా మామూలుగా లేదుగా.. ఒక్కో పాటకి రెమ్యునరేషన్
Sid Sriram: ఇంకేం ఇంకేం కావాలి అంటూ గీత గోవిందం పాట విని ఎవరిదీ కొత్త గొంతు ఎంత మధురంగా ఉందీ అనుకున్నారు..

Sir Sriram: సిద్ధ్ శ్రీరామ్ పాటకి మైమరచిపోతారు సంగీత ప్రియులు.. ఇంకేం ఇంకేం కావాలి అంటూ గీత గోవిందం పాట విని ఎవరిదీ కొత్త గొంతు ఎంత మధురంగా ఉందీ అనుకున్నారు..

సిద్ధార్థ్ శ్రీరామ్ కర్ణాటక సంగీతకారుడు. భారతీయ-అమెరికన్ సంగీత నిర్మాత, నేపథ్య గాయకుడు మరియు పాటల రచయిత కూడా అయిన సిద్ శ్రీరామ్‌కి తెలుగు ఇండస్ట్రీలో మంచి డిమాండ్ ఉంది. యూఎస్‌లో పెరిగిన ఈ సింగర్ వాయిస్‌లో ఓ మ్యాజిక్ ఉంది. అతను తన మనోహరమైన గొంతుతో సంగీత ప్రియుల హృదయాలను గెలుచుకున్నాడు.

శ్రీరామ్ తన కెరీర్‌లో చాలా బ్లాక్‌బస్టర్‌లను కలిగి ఉన్నాడు. తాజా నివేదిక ప్రకారం, అతను ఒక పాట పాడినందుకు రూ. 5-7 లక్షల మధ్య పారితోషికం తీసుకుంటున్నాడు.

సాధారణంగా సింగర్‌ను బట్టి రూ.20 వేల నుంచి 50 వేల వరకు ఉంటుంది. బాగా డిమాండ్ ఉందంటే రూ.1.5 లక్షల దాకా రెమ్యునరేషన్ ఇస్తారు. అయితే అతడికి ఉన్న క్రేజ్‌ని బట్టి ఆయనకు రూ.4.5 లక్షలు ఇస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. యూత్‌లో మంచి క్రేజ్ ఉన్న ఈ సింగర్‌కి అంత ఇవ్వడంలో వెనుకడుగు వేయడం లేదు నిర్మాతలు.

లేటెస్ట్‌గా సిద్ద్ పాడిన సాంగ్ ప్రభాస్, పూజా హెగ్డే నటించిన రొమాంటిక్ డ్రామా 'రాధే శ్యామ్' చిత్రంలోని 'తిరైయోడు తూరిగై' పాట. ఇదిలా ఉంటే ప్రముఖ దర్శకుడు మణిరత్నం సినిమాలో హీరోగా నటించే ఛాన్స్ దక్కింది సిద్ శ్రీరామ్‌కి.. సింగర్‌గానే కాదు హీరోగానూ ప్రూవ్ చేసుకునేందుకు సిద్ధమవుతున్నాడు శ్రీరామ్.

Tags

Read MoreRead Less
Next Story