Siddharth : పుష్ప 2 పై సిద్ధార్థ్ హాట్ కామెంట్స్

Siddharth :  పుష్ప 2 పై సిద్ధార్థ్ హాట్ కామెంట్స్
X

హిట్ అనే మాట విని ఏళ్లు గడుస్తున్నా.. యాటిట్యూడ్ లో ఏ మాత్రం తగ్గని స్టార్ సిద్ధార్థ్. మనోడిది కాన్ఫిడెన్స్ అంటారు కొందరు. బలుపు అంటారు చాలామంది. కొన్ని విషయాలను యాటిట్యూడ్ ను దాటి ఒప్పుకుని తీరాలి. ప్రస్తుతం దేశం మొత్తం పుష్ప 2 మేనియా నడుస్తోంది. రిలీజ్ కు ముందు కూడా భారీ అంచనాలున్నాయీ మూవీపై. వాటిని దాటి మరీ కలెక్షన్స్ సాధిస్తోందిప్పుడు. అలాంటి పుష్ప2 కు పోటీగా తన మిస్ యూ అనే సినిమా విడుదల చేయాలనుకున్నాడు. ఆ మధ్య తెలుగులో ప్రెస్ మీట్ తన సినిమాను చూసి పుష్పనే వాయిదా పడాలి అన్నాడు. అప్పుడే మనోళ్లు కౌంటర్స్ వేశారు. తాజాగా తమిళ్ మీడియాతో మాట్లాడుతూ ఈ మూవీపై తన అక్కసును మరోసారి వెల్లగక్కాడు సిద్ధార్థ్.

పుష్ప 2 పై పోటీగా సినిమా వేయాలనుకున్నారు.. ఆ మూవీకి చాలా క్రేజ్ ఉంది. బిహార్ లోని పట్నాలో ప్రీ రిలీజ్ ఈవెంట్ కుజనం ఎలా వచ్చారో చూశారు కదా అని అడిగితే.. జనంది ఏముంది.. ఊరిలో నాలుగు జేసిబిలు వచ్చినా వింతగా చూడ్డానికి వస్తారు. సినిమా వాళ్లు వస్తే రావడంలో ఆశ్చర్యం ఏముందీ. ఓపెన్ గ్రౌండ్ లో ఫంక్షన్ అంటే ఆ మాత్రం వస్తారు.అయినా బీర్లు, బిర్యానీలు తీసుకుని కూడా జనం వస్తున్నారు కదా అంటూ నోరు పారేసుకున్నాడు.

అయితే ఇలాంటి కమెంట్స్ కు కౌంటర్స్ ఇవ్వడం వేస్ట్. ఎందుకంటే పుష్ప రేంజ్ వేరే ఇప్పుడు. అసలు సిద్ధార్థ్ ఇంకా సినిమాలు చేస్తున్నాడని సాధారణ ప్రేక్షకులకే తెలియదు. ఇలాంటి వాటికి కౌంటర్ ఇస్తే అతనికే ఫ్రీ పబ్లిసిటీ. అదే ఎత్తుగడతో ఇలాంటి కామెంట్స్ చేస్తున్నాడు సిద్ధూ అంటూ కొందరు అభిమానులు కాస్త మెచ్యూర్డ్ గా మాట్లాడుతుండటం విశేషం.

Tags

Next Story