సినిమా

Siddharth: సిద్ధార్థ్ మొదటి భార్య ఎవరో తెలుసా?

Siddharth: సినిమా రంగంలో ప్రేమించి పెళ్లి చేసుకోవడం, ఆ తర్వాత విడాకులు తీసుకోవడం సహజం.

Siddharth: సిద్ధార్థ్ మొదటి భార్య ఎవరో తెలుసా?
X

Siddharth: సినిమా రంగంలో ప్రేమించి పెళ్లి చేసుకోవడం, ఆ తర్వాత విడాకులు తీసుకోడవం సహజం. ఇప్పటికీ ఎన్నో జంటలు కొంతకాలం సంతోషంగా కలిసుండి.. చిన్న చిన్న మనస్పర్థలతో విడిపోయాయి. అలా విడిపోయిన వారిలో సిద్ధార్థ్, మేఘన కూడా ఉంటారు. సిద్ధార్థ్ ఎవరో మనకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగులోనే కాదు తమిళంలో కూడా లవర్‌ బాయ్‌గా పేరు తెచ్చుకున్నాడు సిద్ధార్ధ్. తన మొదటి భార్య పేరే మేఘన.

సిద్దార్థ్, మేఘన 2003లో పెళ్లి చేసుకున్నారు. నాలుగు సంవత్సరాలు కలిసున్న తర్వాత 2007లో వీరు విడాకులు తీసుకున్నారు. అసలు ఈ మేఘన ఎవరు అనే విషయాన్ని మ్యారీడ్ లైఫ్‌లో ఉన్నప్పుడు కానీ, విడాకులు తీసుకున్న తర్వాత కానీ ఎప్పుడూ రివీల్ చేయలేదు సిద్ధార్థ్. అయితే విడాకుల సమయానికి వీరిద్దరికి ఇద్దరు పిల్లలు ఉన్నారని వార్తలు వచ్చినా అవి ఎంతవరకు నిజమన్నది ఎవ్వరికీ తెలీదు.

మేఘనతో విడిపోయిన తర్వాత తనతో నటించిన పలువురు హీరోయిన్లతో సిద్ధార్ధ్ ప్రేమాయణాన్ని నడిపించాడు. ముందుగా బాలీవుడ్ భామ సోహా ఆలీ ఖాన్‌తో ప్రేమలో పడ్డాడు సిద్ధు. మేఘన నుండి విడిపోవడానికి కూడా సోహానే కారణమని నెటిజన్లు అనుకున్నారు. అయినా సిద్ధు, సోహాల ప్రేమకథ ఎక్కువకాలం సాఫీగా సాగలేదు. కొన్ని వ్యక్తిగత గొడవల వల్ల వీరిద్దరు తొందరగానే విడిపోయారు.

సోహా ఆలీ ఖాన్ తర్వాత కూడా సిద్ధు తన కో స్టార్లను ప్రేమించాడు. అప్పట్లో సిద్ధార్థ్ పర్సనల్ లైఫ్‌పై చాలానే వార్తలు వచ్చేవి. కానీ సిద్ధు ఇవేమి పట్టించుకోలేదు. తాను చివరిగా 'ఎనక్కుళ్ ఒరువన్' అనే తమిళ చిత్రంలో తనతో కలిసి నటించిన దీప సన్నిధితో డేటింగ్‌లో ఉన్నాడని వార్తలు వచ్చాయి. ఆ తర్వాత సిద్ధు కెరీర్ డ్రాప్ అవ్వడంతో ప్రేక్షకులు తన పర్సనల్ లైఫ్ కూడా ఫోకస్ పెట్టడం మానేసారు.

Divya Reddy

Divya Reddy

TV5 News Desk


Next Story

RELATED STORIES