Siddharth: సిద్ధు ట్వీట్ వారి గురించేనా? చీటర్ అన్నది ఆ నటినేనా?

Siddharth: సిద్ధు ట్వీట్ వారి గురించేనా? చీటర్ అన్నది ఆ నటినేనా?
Siddharth: ఈరోజుల్లో ఏ ఇష్యూ గురించి అయినా సోషల్ మీడియాలో స్పందించడం కామన్ అయిపోతోంది సెలబ్రిటీలకు.

Siddharth: ఈరోజుల్లో ఏ ఇష్యూ గురించి అయినా సోషల్ మీడియాలో స్పందించడం కామన్ అయిపోతోంది సెలబ్రిటీలకు. ప్రత్యక్షంగా అయినా, పరోక్షంగా అయినా ప్రస్తుతం హాట్ టాపిక్‌లపై తమ అభిప్రాయాలను నెటిజన్లుతో పంచుకున్నారు సెలబ్రిటీలు. తాజాగా నాగచైతన్య, సమంత విడాకుల వ్యవహారం ఇంటర్నెట్‌లో అనేక చర్చలకు దారితీసింది. దానిపై ఆర్‌జీవి లాంటి డైరెక్టర్ కూడా తన ట్విటర్‌లో స్పందించాడు. తనతో పాటు వీరి విడాకుల వ్యవహారంపై ఇన్‌డైరెక్ట్‌గా స్పందించాడు మరో హీరో.

సిద్ధార్థ్ కూడా ఇప్పుడిప్పుడే కాంట్రవర్సీలకు కేరాఫ్ అడ్రస్‌లాగా మారిపోయాడు. తెలుగు ఇండస్ట్రీలో హీరోగా ఫేడవుట్ అయిపోయినా సిద్ధు తన సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గానే ఉన్నాడు. తాజాగా ఒక రాజకీయ నాయకుడితో తనకు అయిన గొడవ తన ట్విటర్ ఫాలోవర్స్‌ను మరింత పెంచింది. అయితే తాజాగా సిద్ధు పెట్టిన ఒక పోస్ట్ కూడా చైసామ్ విడాకుల గురించేనేమో అని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

కెరీర్ మొదట్లో సమంత, సిద్ధార్థ్ కలిసి ఒక సినిమాలో నటించారు. ఆ సినిమా టైమ్‌లోనే వారి మధ్య ప్రేమ చిగురించిందని ఊహాగానాలు వినిపించాయి. అంతే కాకుండా వీరిద్దరికి నిశ్చితార్థం కూడా అయిపోయిందని ఆమధ్య వార్తలు వచ్చాయి. ఇది నిజమా కాదా అన్న విషయంపై వారిద్దరూ ఎప్పుడూ పెద్దగా స్పందించలేదు. కారణాలు ఏంటో తెలియకపోయినా వీరు కొంతకాలం తర్వాత మాట్లాడుకోవడం మానేసారు.

సిద్దార్థ్, సమంత కెరీర్‌లు వేర్వేరు దారుల్లో సాగాయి. అప్పటినుండి ఒకరి గురించి ఒకరు పెద్దగా మాట్లాడింది లేదు. కానీ ఇంతకాలం తర్వాత సిద్ధు పెట్టిన ట్వీట్ వారి విడాకులకు రిలేట్ అవుతుందని నెటిజన్లు అనుకుంటున్నారు. చీటర్స్ ఎప్పుడూ బాగుపడరు అన్నది నేను స్కూల్‌లో నేర్చుకున్న మొదటి పాఠం అని ట్వీట్ పెట్టాడు సిద్ధార్థ్. ఇప్పుడు ఈయన ఎవరిని చీటర్ అన్నారు అని నెటిజన్లంతా సందేహంలో ఉన్నారు.

Tags

Next Story