Siddharth wishes Aditi Rao Hydari : హృదయ రాణికి పుట్టినరోజు శుభాకాంక్షలు: అదితికి సిద్ధార్థ్ స్పెషల్ విషెస్

Siddharth wishes Aditi Rao Hydari : తన ప్రియురాలు మరియు నటి అదితి రావు హైదరీకి నటుడు సిద్ధార్థ్ శుక్రవారం శుభాకాంక్షలు చెప్పడం సోషల్ మీడియాలో సంచలనం సృష్టించింది.
ఫోటోను పంచుకుంటూ, సిద్ధార్థ్ ఇలా వ్రాశాడు, "హ్యాపీ హ్యాపీ. హృదయ యువరాణి @aditiraohydari పుట్టినరోజు శుభాకాంక్షలు. నేను మీ కలలన్ని సాకారం కావాలని కోరుకుంటున్నాను. పెద్దవి, చిన్నవి ఏవైనా సరే వాటిని మీరు ఫుల్‌ఫిల్ చేయాలి అని రెండ్ హార్ట్ ఎమోజీ ఉంచాడు.
ఈ జంట గత కొంతకాలంగా రిలేషన్‌షిప్‌లో ఉన్నట్లు రూమర్స్ వచ్చాయి.
"సిద్ధార్థ్, అదితి చెన్నైలో సహజీవనం చేస్తున్నట్లు ఇండస్ట్రీలో టాక్. ఈ మధ్య జరిగే సినిమా ఈవెంట్లలో వీరిరువురూ కలిసే కనిపిస్తున్నారు. అదితి చెన్నైని తన ఇంటిగా మార్చుకుంది. అయితే వీరిద్దరూ పెళ్లి చేసుకుంటారా లేదా అని దానిగురించి ఇంకా ఎటువంటి సమాచారం లేదు.
సిద్ధార్థ్, అదితి గత సంవత్సరం మహాసముద్రం సినిమా సెట్స్‌లో కలుసుకున్నారు. ఆ తర్వాత నుంచి వారు డేటింగ్ ప్రారంభించారు. ఇటీవల పొన్నియిన్ సెల్వన్ ఆడియో లాంచ్‌కి కలిసి హాజరయ్యారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com