Siddhi Idnani : ఆ విషయం ఇప్పటికీ నమ్మలేకపోతున్నా : సిద్ధి ఇద్నాని

Siddhi Idnani : సిద్ధి ఇద్నాని అప్‌కమింగ్ టాప్ యాక్ట్రస్.. టాలీవుడ్‌లో 2018లో వచ్చిన జంబలకడి పంబ ద్వారా ఎంట్రీ ఇచ్చింది. ఆ తరువాత ప్రేమకథా చిత్రం, అనుకున్నదొక్కటి అయినదొక్కటిలో మెయిన్ సపోర్టింగ్ రోల్స్ ప్లే చేసింది. ఇప్పుడు కోలీవుడ్‌లో శింబు సరసన గౌతమ్ మేనన్ దర్శకత్వంలోని 'వెందు తనిందతు కాదు' మూవీలో నటించే అవకాశం వచ్చింది.
'ఇప్పటికీ నేను గౌతమ్ మేనన్ సినిమా హీరోయిన్ అంటే నమ్మలేకపోతున్నా' అని భావోద్వేగంతో సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ మూవీకి నేనే స్వయంగా డబ్బింగ్ చెప్పే అవకాశం ఇచ్చినందుకు గౌతమ్ మీనన్‌కు ప్రత్యేక థ్యాంక్స్ చెబుతున్నట్లు చెప్పింది. నా కల నిజమైనందుకు నాకు చాలా సంతోషంగా ఉంది అని తన మనసులోని భావాలను ప్రకటించింది సిద్ధి ఇద్నాని. కంప్లీట్ థ్రిల్లర్ జానర్‌లో 'వెందు తనిందతు కాదు' మూవీ సెప్టెంబర్ 15న విడుదలకు రెడీ అవుతోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com