Siddhu Jonnalagadda: సిద్ధు యాటిట్యూడ్ మారిపోయిందా..? హీరోతో డైరెక్టర్ ఇబ్బందులు..?

Siddhu Jonnalagadda: సిద్ధు జొన్నలగడ్డ.. కొంతకాలం క్రితం ఈ పేరంటే తెలుగు ప్రేక్షకులలో కొందరికి మాత్రమే తెలుసు. కానీ 'డీజే టిల్లు' అనే సినిమా సిద్ధు కెరీర్‌నే మార్చేసింది. ఒక చిన్న సినిమాగా వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది డీజే టిల్లు. దీంతో సిద్ధు 12 ఏళ్లుగా ఎదురుచూస్తున్న సక్సెస్ తన సొంతమయ్యింది. దీంతో సిద్ధు యాటిట్యూడే మారిపోయిందంటూ టాలీవుడ్ సర్కిల్స్‌లో టాక్ వినిపిస్తోంది.
డీజే టిల్లు విడుదల కాకముందే సిద్ధు పలు ప్రాజెక్ట్‌లకు సైన్ చేశాడు. ఇప్పుడు డీజే టిల్లు తర్వాత సిద్ధుకు క్రేజ్ పెరగడంతో అందులో కొన్ని సినిమాల భవిష్యత్తుపై తనకు అనుమానం మొదలయ్యిందట. కొన్ని పాత్రలలో తనను ప్రేక్షకులు యాక్సెప్ట్ చేస్తారో లేదో అన్న సందేహంతో పక్కన పెట్టేస్తున్నాడని సమాచారం. అలా ఒక డైరెక్టర్‌ను ఇబ్బందులకు గురిచేస్తున్నాడట ఈ డీజే టిల్లు హీరో.
మలయాళ సూపర్ హిట్ అయిన సినిమా 'కప్పెలా'ను తెలుగు రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే మలయాళంలో శ్రీనాథ్ బాసి చేసిన క్యారెక్టర్‌ను తెలుగులో సిద్ధు చేయాల్సి ఉంది. అయితే పాత్ర నిడిపి కాసేపే అనో, లేదా మరే ఇతర కారణం వల్లో ఈ రీమేక్ నుండి తప్పుకోవాలని సిద్ధు నిర్ణయించుకున్నాడట. అయితే అగ్రిమెంట్ సైన్ చేసి, షూటింగ్ మొదలుపెట్టిన తర్వాత అలా ఎలా తప్పుకుంటారని డైరెక్టర్ ప్రశ్నించగా.. సిద్ధు దురుసుగా ప్రవర్తించాడని టాలీవుడ్‌లో రూమర్స్ వినిపిస్తున్నాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com