Siddu Jonnalagadda : అప్పుడు కార్తికేయ, ఇప్పుడు సిద్ధు జొన్నలగడ్డ

Siddu Jonnalagadda :  అప్పుడు కార్తికేయ, ఇప్పుడు సిద్ధు జొన్నలగడ్డ
X

కొన్ని కథలను టచ్ చేస్తున్నప్పుడు వాటికి ఉండే సీరియస్ నెస్ ను కంటిన్యూ చేయాలి. అలా కాదని.. కొత్తదనం కోసమనీ.. కామెడీ చేస్తే కాసులు పోతాయి. రీసెంట్ గా వచ్చిన సిద్ధు జొన్నలగడ్డ మూవీ జాక్ పరిస్థితి అదే అయింది. ఈ మూవీ ఆల్ టైమ్ డిజాస్టర్స్ లిస్ట్ లోకి వెళ్లిపోయింది. డిజే టిల్లు, డిజే టిల్లు స్క్వేర్ వంటి బ్లాక్ బస్టర్స్ తర్వాత వచ్చిన సిద్ధు కాన్ఫిడెన్స్ ను కూడా ఈ మూవీ దెబ్బ తీసింది అంటే అతిశయోక్తి కాదు. అంతేకాక పరాయి ప్రాజెక్ట్స్ లోకి ఎక్కువగా వేళ్లు పెట్టకూడదు అనేది కూడా అతనికి అర్థం అయి ఉంటుంది. తన ఓవర్ ఇన్వాల్వ్ మెంట్ కాస్త ఎక్కువగానే ఉందీ ప్రాజెక్ట్ లో అనేవాళ్లు చాలామందే ఉన్నారు. దర్శకుడి క్రియేటివిటీని కూడా కిల్ చేస్తాయి ఈ ఇన్వాల్వ్ మెంట్స్.

ఇక రా ఏజెంట్స్ ను కామెడీ చేస్తూ.. ఆ ఏజెన్సీ ఇంటిగ్రిటీనే ఇన్సల్ట్ చేసేలా ఆ పాత్రలను హేళనగా చూపించాడు దర్శకుడు. ఈ కారణంగా అటు సీరియస్ పోయింది. ఇటు కామెడీ కూడా పండలేదు. కట్ చేస్తే డిజాస్టర్ అయింది. అయితే ఇలా సీరియస్ పాత్రలను కామెడీ చేయడం ఇదేం ఫస్ట్ టైమ్ కాదు. కాస్త ఆలోచించి చూస్తే.. 2021లో కూడా ఈ తరహా సినిమా వచ్చింది. ఆర్ఎక్స్ 100 హీరో కార్తికేయ నటించిన ఆ చిత్రం రాజా విక్రమార్క.

ఈ రాజా విక్రమార్కలోనూ అంతే.. ఎన్ఐఏ పాత్రలను కామెడీ చేసి చూపించారు. హీరో సినిమా మొత్తం జోవియల్ గానే ఉంటాడు. తన చీఫ్ తో నిరంతరం తిట్లు తింటూనే ఉంటాడు. అయినా హీరో కదా.. తను గెలుస్తుంటాడు. బట్ సినిమా పోయింది. ఇదీ డిజాస్టరే.

సో.. మనకు రా ఏజెంట్స్, సిబిఐ, ఎన్ఐఏ, ఆర్మీ ఇలాంటివి సెంటిమెంట్. వీళ్లు దేశం కోసం పనిచేస్తారు. ప్రాణాలు సైతం లెక్క చేయరు. అలాంటి హీరోలను వెండితెరపై కమెడియన్స్ గా చూపిస్తే ఆడియన్స్ ఒప్పుకోరు అని మరోసారి ప్రూవ్ అయింది.

Tags

Next Story