సిద్ధూ విత్ సమంత.. క్రేజీ కాంబినేషన్

సిద్ధూ విత్ సమంత.. క్రేజీ కాంబినేషన్
స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం పలు ప్రాజెక్టులతో బిజీగా ఉంది. ఆమె పాన్ ఇండియా మూవీ ఖుషీతో పాటు సిటాడెల్ వంటి వెబ్ సిరీస్‌లలో నటిస్తోంది.

స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం పలు ప్రాజెక్టులతో బిజీగా ఉంది. ఆమె పాన్ ఇండియా మూవీ ఖుషీతో పాటు సిటాడెల్ వంటి వెబ్ సిరీస్‌లలో నటిస్తోంది. ఆమె నటించిన శాకుంతలం భారీ డిజాస్టర్ అయింది. పని చేయడం వరకే మన కర్తవ్యం. రిజల్ట్ గురించి ఆలోచించకూడదు అని చెప్పిన సామ్.. ఆ తర్వాత చేయబోయే సినిమాలపై దృష్టి పెట్టింది. ఇప్పటికే కమిట్ అయిన ఖుషీ, సిటాడెల్ తర్వాత యంగ్ హీరో సిద్ధూతో సమంత జతకట్టనుంది.

ఇండస్ట్రీలో క్రేజీ హీరోగా పేరు తెచ్చుకున్న సిద్ధూతో సామ్ ఓ సినిమా చేయనుందనే వార్త ఫిల్మ్ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. డీజే టిల్లుతో ఇండస్ట్రీలో క్రేజీ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు సిద్ధు. డీజే టిల్లులో సిద్ధూ నటన, డైలాగ్ డెలివరీకి అందరూ ఫిదా అయ్యారు. డీజే టిల్లు సినిమాను హిట్ చేసిన సిద్ధూ రాత్రికి రాత్రే స్టార్ డమ్ సంపాదించుకున్నాడు.

ఈ క్రేజీ హీరోతో నిర్మాత రామ్ తాళ్లూరి ఓ సినిమా చేసేందుకు ప్లాన్ చేస్తున్నాడు. ఈ ప్రాజెక్టుకు నందిని రెడ్డి దర్శకత్వం వహించనున్నట్లు సమాచారం. నందిని రెడ్డి, సమంతల మధ్య మంచి అనుబంధం ఉన్న సంగతి తెలిసిందే. ఓ బేబీ సినిమాతో నందినీరెడ్డి, సమంత మంచి స్నేహితులయ్యారు. ఇద్దరూ సోషల్ మీడియాలో ఎప్పుడూ సరదాగా ముచ్చటించుకుంటారు.

ఈ ప్రాజెక్ట్ గురించి నందిని రెడ్డి చెప్పినప్పుడు సమంత సానుకూలంగా స్పందించిందని అంటున్నారు. మరి స్టార్ హీరోయిన్ సమంత సరసన నటించే ఛాన్స్ వస్తే ఎవరు వదులుకుంటారు? అందుకే సిద్ధు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయి. అన్నీ అనుకూలిస్తే సమంత-సిద్దుల కాంబినేషన్ తెరపైకి రానుందని టాక్. మరి ఈ వార్తలపై క్లారిటీ రావాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు ఆగాల్సిందే.

Tags

Read MoreRead Less
Next Story