Siddu Jonnalagadda : సిద్ధు జొన్నలగడ్డ కొంచెం క్రాక్ అంట

Siddu Jonnalagadda :   సిద్ధు జొన్నలగడ్డ కొంచెం క్రాక్ అంట

స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ మూవీ అంటే మినిమం గ్యారెంటీ అనేలా చేసుకున్నాడు. అతని కెరీర్ డిజే టిల్లుకు ముందు డిజే టిల్లు తర్వాత అనేలా మారింది. ఈ మూవీ ఆడియన్స్ పై వేసిన ఇంపాక్ట్ చిన్నది కాదు. ప్రతి రోజూ ఏదో సందర్భంలో ఎవరో ఒకరు ఈ టిల్లు సినిమాలోని డైలాగ్స్ గురించి మాట్లాడకుండా ఉండలేరు. అదీ ఆ మూవీ ప్రభావం. డిజే టిల్లు స్క్వేర్ కూడా సూపర్ హిట్ కావడంతో దూకుడు పెంచాడు సిద్ధు. వరుసగా మూవీస్ చేస్తున్నాడు. ఇందులో నీరజా కోన డైరెక్షన్ లో తెలుసు కదా అనే మూవీ ప్రత్యేకంగా కనిపిస్తోంది. అయితే ఈ మూవీ కంటే చాలా ముందే ఒక ప్రాజెక్ట్ కమిట్ అయ్యాడు సిద్ధు.

బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్షన్ లో రూపొందబోతోన్న ఈ మూవీలో బేబీ ఫేమ్ వైష్ణవి చైతన్య హీరోయిన్ గా నటిస్తోంది. చాలా సైలెంట్ గా ఈ మూవీ షూటింగ్ కంప్లీట్ చేస్తోంది టీమ్. ఇప్పటికే 80 శాతం వరకూ షూటింగ్ అయిపోయిందట. అయితే ఈ మూవీకి ‘ కొంచెం క్రాక్’అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారట. ప్రస్తుతం సిద్ధుకు ఉన్న ఇమేజ్ ను బట్టి చూస్తే ఈ టైటిల్ పర్ఫెక్ట్ గా సెట్ అవుతుందతనికి. నిజానికి ఈ టైటిల్ కంటే ముందు జాక్ అనే టైటిల్ తోనే మూవీ అనౌన్స్ అయింది. బట్ స్టోరీ ప్రకారంగా చూస్తే ఈ కొంచెం క్రాక్ అనే టైటిల్ పర్ఫెక్ట్ గా సూట్ అవుతుందనుకుంటున్నారట. విశేషం ఏంటంటే.. డిజే టిల్లుకు కూడా ముందు నరుడి బ్రతుకు నటన అనే టైటిల్ తో స్టార్ట్ చేశారు. షూటింగ్ జరుగుతున్నా కొద్దీ టిల్లు పేరు హైలెట్ కావడంతో డిజే టిల్లు అని పెట్టారు.


ప్రస్తుతం హైదరాబాద్ లో షూట్ చేస్తున్నారు. ఈ పార్ట్ లో ప్రకాష్ రాజ్, నరేష్, బ్రహ్మాజీ వంటి నటులతో సిద్ధు, వైష్ణవి మధ్య వచ్చే కామెడీ సీన్స్ చిత్రీకరిస్తున్నారట. త్వరలోనే టైటిల్ పోస్టర్ తో పాటు రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేస్తారని టాక్. మొత్తంగా ఓ డిఫరెంట్ కాంబోలో రూపొందుతోన్న ఈ మూవీకి కొంచెం క్రాక్ అనే టైటిల్ బలే అనిపిస్తోంది కదా..?

Tags

Next Story