Sidhu Jonnalagadda: క్రేజీ అప్డేట్.. మాలీవుడ్ రీమేక్‌లో సిద్ధు

Sidhu Jonnalagadda: సిద్దు జొన్నలగడ్.. మంచి ఎనర్జిటిక్ హీరో.. డీజే కొట్టి మరీ చెప్పాడు.. బ్లాక్ బస్టర్ హిట్ చేశాడు.. విమల్ కృష్ణ డైరెక్షన్‌లో వచ్చిన డిజే టిల్లుకి యువత బ్రహ్మరథం పట్టారు. కోవిడ్‌రాకతో వెలవెల పోయిన థియేటర్లు.. డిజే టిల్లు రాకతో ఒక్కసారిగా మళ్లీ ఊపందుకున్నాయి. ఈ సక్సెస్ టిల్లు టీమ్‌లో సంతోషాన్ని పెంచింది. దీంతో డీజే టిల్లు 2 తీయడానికి కూడా సిద్ధమైపోతున్నారు. ఈ నేపథ్యంలో సిద్ధుకి సంబంధించిన మరో ఇంట్రెస్టింగ్ వార్త సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతోంది.
మలయాళ స్టార్ హీరోటొవినో థామస్ లీడ్ రోల్‌లో నటించిన హిట్ సినిమా థళ్లుమాలను తెలుగులో రీమేక్ చేయనుండగా అందులో సిద్ధు లీడ్ రోల్ చేయబోతున్నాడట. ఓ యువదర్శకుడు ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రొడక్షన్ హఃస్, ఇతర సాంకేతిక నిపుణుల వివరాలపై త్వరలోనే క్లారిటీ ఇవ్వనున్నారు మేకర్స్.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com