Sidhu Jonnalagadda : సిద్ధు జొన్నలగడ్డ.. గన్ పట్టుకున్నాడేంటీ

స్టార్ బాయ్ అని చెప్పుకునే లోగానే నెగెటివ్ మూవీస్ పడిపోయాయి సిద్ధు జొన్నలగడ్డకు. డిజే టిల్లు, టిల్లు స్క్వేర్ తర్వాత 2025లోనే జాక్, తెలుసు కదా అనే మూవీస్ తో లాస్ అయ్యాడు. దీంతో నెక్ట్స్ ఏంటీ అనే ప్రశ్నలో పడిపోయాడు. అందుకు ఆన్సర్ దొరికింది. నాగవంశీనే ప్రొడ్యూస్ చేయబోతోన్న మూవీ అనౌన్స్ అయింది. ఏజెంట్ సాయి శ్రీనివాస ఫేమ్ స్వరూప్ ఆర్.ఎస్.జే డైరెక్షన్లో ఈ చిత్రం ఉండబోతోంది. ఈ మేరకు వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఈ మూవీని అనౌన్స్ చేశాయి నాగవంశీ.
రూరల్ బ్యాక్ డ్రాప్ లో ఉండబోతోంది. ఓ చిన్న పట్టణం నేపథ్యంలో సాగే సినిమా అన్నట్టుగా ఈ ఫస్ట్ లుక్ వదిలారు. దీంతో పాటు ఆ పోస్టర్ తో పాటు ఓ గన్ కూడా చూపించారు. మరి ఇది పూర్తిగా ఎంటర్టైన్మెంట్ తో రూపొందే సినిమానా లేక సీరియస్ తో మోడ్ లో సాగే మూవీనా అనేది తెలియాల్సి ఉంది. హీరోయిన్ తో పాటు ఇతర వివరాలు ఇంకా ఏం చెప్పలేదు. నాగవంశీ 40వ సినిమాగా ఇది రూపొందబోతోంది. మరి సిద్ధు జొన్నలగడ్డకు ఈ మూవీ ప్లస్ అవుతుందా లేదా అనేది తెలియాల్సి ఉంది.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

