Salman Khan : ఆల్ టైమ్ బిగ్గెస్ట్ డిజాస్టర్ గా డిక్లేర్ అయిన సికందర్

Salman Khan :  ఆల్ టైమ్ బిగ్గెస్ట్ డిజాస్టర్ గా డిక్లేర్ అయిన సికందర్
X

సల్మాన్ ఖాన్ సికందర్ ను ఆల్ టైమ్ బిగ్గెస్ట్ డిజాస్టర్ అని ప్రతి ఒక్కరూ అంటున్నారు. యస్.. ఈ మూవీ సాధించిన వసూళ్లు అలా ఉన్నాయి మరి. చూడ్డానికి పెద్ద కలెక్షన్స్ లా కనిపిస్తున్నా.. బడ్జెట్ కు ఈ కలెక్షన్స్ కు టైటిల్ కార్డ్స్ కు ఎండ్ కార్డ్ కు ఉన్నంత తేడా ఉంది. అందుకే ఇది భాయ్ కెరీర్ లో భారీ డిజాస్టర్ అని డిక్లేర్ చేస్తున్నారు విశ్లేషకులు. ఏఆర్ మురుగదాస్ డైరెక్షన్ లో రూపొందిన సికందర్ లో రష్మిక మందన్నా, కాజల్ అగర్వాల్ హీరోయిన్లుగా నటించారు. రష్మిక పాత్ర చనిపోతుంది. అంతకు ముందే సినిమా చనిపోయిందన్నారు చాలామంది. .

అసలే లో బజ్ తో విడుదలైంది సికందర్. అంతకు ముందు అస్సలు ఏ మాత్రం ఆసక్తి లేదీ సినిమాపై. దీనికి తోడు రిలీజ్ కు ముందు రోజే హెచ్.డి ప్రింట్ లీక్ అయ్యింది. అది ఏకంగా 600 వెబ్ సైట్స్ లో అందుబాటులోకి వచ్చింది. ఇది పెద్ద ఎఫెక్ట్ అనుకోవచ్చు. బట్ ఓపెనింగ్స్ మరీ పూర్ గా ఉన్నాయి. నాన్ హిందీ హీరోలే అక్కడ 70, 80 కోట్ల ఓపెనింగ్స్ తెచ్చుకుంటుంటే భాయ్ మూవీకి కేవలం 22 కోట్లు వచ్చాయి మొదటి రోజు. తరవాత రోజు 25.25 కోట్లు, మూడో రోజు 17, నాలుగో రోజు 7.50 కోట్లు, ఐదో రోజు 5.25 కోట్లు.. మొత్తం కలిపి ఐదు రోజుల్లో కేవలం 77 కోట్లు మాత్రమే వసూళ్లయ్యాయి.

అయితే సినిమా బడ్జెట్ ఎంతో తెలుసా..? 200 కోట్లు. అవును అక్షరాలా రెండు వందల కోట్లు. ఆ బడ్జెట్ కు ఐదు రోజుల్లో వచ్చిన ఈ కలెక్షన్స్ కు ఏమన్నా సంబంధం ఉందా..? సో.. ఇది భాయ్ కెరీర్ లోనే ఆల్ టైమ్ బిగ్గెస్ట్ డిజాస్టర్ గా డిక్లేర్ అయిపోయింది.

Tags

Next Story