Simbu : తమిళ ఇండస్ట్రీ నుంచి ఒకే ఒక్కడు!

Simbu : తమిళ ఇండస్ట్రీ నుంచి ఒకే ఒక్కడు!
X

భారీ వర్షాలకు తెలుగు రాష్ట్రాలలోని పలు ప్రాంతాలు వరద నీటిలో చిక్కుకుని ప్రజలు ఇబ్బందులు పడుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రజల ఇబ్బందులు తొలగించేందుకు తనవంతు సాయంగా రూ.6 లక్షలు విరాళం అందిస్తున్నట్లు తమిళ నటుడు శింబు ప్రకటించారు. తెలంగాణ, ఏపీ సీఎం రిలీఫ్ ఫండ్‌కు రూ.3 లక్షల చొప్పున ఇస్తున్నట్లు తెలిపారు. దీంతో ఇతర ఇండస్ట్రీల నుంచి స్పందించిన నటుడు ఆయనొక్కరేనని నెటిజన్లు అభినందిస్తున్నారు. వరద భాదితుల సహాయార్థం కనీస అవసరాలు తీర్చేందుకు తెలుగు సినీ పరిశ్రమ తమ వంతుగా ఆర్థిక సాయం చేసింది. జూనియర్ ఎన్టీయార్, పవన్ కళ్యాణ్, అశ్వనీదత్, మహేశ్ బాబు, విశ్వక్ సేన్, అల్లు అర్జున్, రెండు తెలుగు రాష్ట్రాల సీఎం రిలీఫ్ ఫండ్ కు భారీగా ఆర్థిక సాయం ప్రకటించారు.

Tags

Next Story