Simbu: త్వరలోనే నిధి అగర్వాల్, శింబు పెళ్లిపై క్లారిటీ.. అనౌన్స్‌మెంట్ ఎప్పుడంటే..

Simbu: సినీ పరిశ్రమలో ప్రేమకథలు సహజం. ఆ ప్రేమకథల్లో కొన్ని మాత్రమే పెళ్లి వరకు వెళతాయి. అలా ఇండస్ట్రీలో చెప్పుకోవడానికి ఎన్నో బ్రేకప్స్ ఉన్నాయి. అందులో శింబుది కూడా ఒకటి. ఆ యంగ్ హీరో ఇప్పటికీ ఎంతోమంది హీరోయిన్లతో ప్రేమలో పడ్డాడు. కానీ అందులో ఎవరూ తనతో పర్మనెంట్‌గా ఉండిపోలేదు. తాజాగా మరో హీరోయిన్‌ను ప్రేమిస్తు్న్న శింబు.. తననే పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.
కోలీవుడ్‌లో చాలా క్రేజ్ ఉన్న హీరోల్లో శింబు కూడా ఒకడు. అతడిని ముద్దుగా అక్కడ లవర్ బాయ్ అని కూడా పిలుచుకుంటారు. ఆన్ స్క్రీన్‌తో పాటు ఆఫ్ స్క్రీన్ కూడా చాలా కూల్‌గా కనిపించే శింబు లైఫ్‌లో చాలా ప్రేమకథలే ఉన్నాయి. అంతే కాక వాటి వల్ల తాను చాలా ట్రాజెడీ కూడా ఎదుర్కున్నాడు. ఫైనల్‌గా శింబు ఇక పెళ్లి చేసుకుందామని ఫిక్స్ అయినట్టు తెలుస్తోంది.
బాలీవుడ్‌లో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చి టాలీవుడ్, కోలీవుడ్‌లో తానేంటో నిరూపించుకునే ప్రయత్నం చేస్తోంది నిధి అగర్వాల్. తాను శింబు హీరోగా నటించిన 'ఈశ్వరన్' చిత్రంతో కోలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమా షూటింగ్ సమయంలో వీరిద్దరు ప్రేమలో పడ్డారని రూమర్స్ తెగ చక్కర్లు కొట్టాయి. దీనిపై వీరిద్దరు స్పందించకపోయినా.. ఇది నిజమేనంటూ కోలీవుడ్ వర్గాలు అంటున్నాయి.
ప్రస్తుతం 'మానాడు' సినిమా సక్సెస్‌తో ఫుల్ ఫార్మ్‌లో ఉన్న శింబు.. నిధితో ప్రేమను పెళ్లి వరకు తీసుకెళ్లాలనే ఆలోచనలో ఉన్నాడట. అందుకే ఫిబ్రవరీ 3న తన పుట్టినరోజు సందర్భంగా వీరి పెళ్లి గురించి ఓ క్లారిటీ ఇవ్వనున్నట్టు టాక్ వినిపస్తోంది. ఇది నిజమో కాదో తెలియాలంటే మరికొన్ని ఆగాల్సిందే అంటూ శింబు అభిమానులు ఎదురుచూస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com