Singer Kalpana: ఎవరూ సహాయం చేయలేదు.. చీకటిలో ఒంటరి పోరాటం చేశా: గాయని కల్పన

Singer Kalpana: టాలెంట్ ఉంటే సరిపోదు.. కొంత అదృష్టం కూడా తోడవ్వాలి. అమ్మానాన్న సింగర్లు.. తండ్రి కొన్ని చిత్రాల్లో నటించారు కూడా.. అందుకే ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఈజీగానే వచ్చింది. అయితే దాన్ని నిలబెట్టుకోవడం కోసం చాలా కష్టపడాల్సి వచ్చింది సింగర్ కల్పనా రాఘవేంద్రకు.. ఆమె మైక్ పట్టుకుంటే ఆడియన్స్ మైమరచి పోవలసిందే.. హుషారు పాటలైనా, రొమాంటిక్ సాంగ్స్ అయినా, ఏ పాట అయినా ఆమె గొంతులో అలవోకగా ఒదిగిపోతుంది. కల్పనా రాఘవేంద్ర పాటకు ప్రేక్షకులు మంత్ర ముగ్ధులవుతారు. ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన జీవిత ప్రస్థానాన్ని వివరించింది కల్పన.
2010లో వివాహ బంధం ముగిసింది. విడాకులతో మానసిక క్షోభ ముగ్గురు ఆడపిల్లలు. ఆత్మహత్యా ప్రయత్నం. కానీ అదే సమయంలో చిత్రగారు పుట్టింది చనిపోవడానికా అని మందలించి మలయాళంలో పాటల పోటీ జరుగుతోందని అందులో పాల్గొనమని ప్రోత్సహించారు. భాష రాదు అయినా ప్రయత్నించింది కల్పన. విజయం సాధించింది. తెలుగు భాషపై పట్టు సాధించడానికి తండ్రే కారణం అని చెప్పింది.
బాలుగారు తప్పులు పాడితే సవరించి చెప్పేవారు. కల్పనకు చదువంటే చాలా ఇష్టం. సిద్ధమెడిసిన్ చేసింది. తనకు, తన పిల్లలకు ఏదైనా అనారోగ్యం వస్తే తనే వైద్యం చేస్తానని చెప్పింది. పాటలే కాదు పలుభాషల్లోనూ ప్రావిణ్యం ఉంది కల్పనకు.. అరబ్, స్పానిష్, జర్మన్, ఇటాలియన్, జపాన్ భాషలు నేర్చుకుంది. అరబిక్, తమిళ్, తెలుగు, సంస్కృతంలో పట్టు సాధిస్తే అన్ని రకాల పాటలు బాగా పాడొచ్చని చెబుతోంది.
మరణించేవరకు ఏదో ఒకటి నేర్చుకుంటూనే ఉంటానని చెప్పిన కల్పన తెలుగు, తమిళ్, హిందీ సినిమాలకు మ్యూజిక్ కంపోజర్‌గా చేస్తున్నట్లు చెప్పింది. పిల్లలకు ఎందులో అయినా ప్రవేశం ఉందా అని అడిగితే.. పెద్దమ్మాయి భరతనాట్యం నేర్చుకుంటున్నట్లు చెప్పారు.. అయినా కళలు అనేవి నేర్చుకుంటే రావు.. చదువంటే వస్తుంది కానీ.. వాటి మీద ప్యాషన్ ఉండాలి. అప్పుడే వస్తుంది అని అంటారు.
చేసే పనిలో నైపుణ్యం, స్పష్టత చాలా అవసరం. అమ్మాయిలు ఎలాంటి సమస్యనైనా ధైర్యంగా అధిగమించవచ్చు అని అన్నారు. బిగ్ బాస్ షోలో పాల్గొనడం గురించి మాట్లాడుతూ.. కొన్ని నిర్ణయాలు అనుకోకుండా తీసుకుంటాం.. అయితే అప్పుడు కూడా ఏదో ఒకటి నేర్చుకుంటాం అని చెప్పారు.
డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా ఎన్నో చిత్రాలకు పని చేసిన కల్పన ఏది ఎక్కువ సంతృప్తినిచ్చింది అంటే.. పాటలు పాడడమే తనకు ఇష్టమని తెలిపింది.. డబ్బింగ్ బావుంటుంది కానీ కొన్ని సందర్భాల్లో అరవాల్సి ఉంటుంది.. ఏడవాల్సి ఉంటుంది.. ఆ సమయంలో చాలా కష్టపడ్డా. దీనికంటే పాటలు పాడడమే మంచిదనిపించి ఇందులో కంటిన్యూ అవుతున్నట్లు చెప్పారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com