Singer KK : కోటి ఆఫర్ చేసినా నో అన్న సింగర్ కేకే..!
Singer KK : ప్రముఖ సింగర్ కృష్ణకుమార్ కున్నత్ (53)మరణం అందర్నీ షాక్ కి గురిచేసింది.. బాలీవుడ్ తో పాటుగా దక్షిణాది బాషలలో కలిపి దాదాపుగా 800కి పైగా పాటలు పాడిన ఆయన కోల్‌కతాలోని ఓ హోటల్‌లో సడన్ గా కుప్పకూలిపోయారు. దీంతో వెంటనే ఆయనని స్థానిక హాస్పిటల్‌కు తరలించారు. కానీ అప్పటికే కేకే చనిపోయినట్లు నిర్ధారించారు డాక్టర్లు.. ఎన్నో పాటలు పాడి ఎంతో పేరు, డబ్బు సంపాదించినప్పటికీ తనకంటూ కొన్ని విలువలు పెట్టుకున్నారు కేకే.. పెళ్లి ఫంక్షన్‌లో పాట పాడేందుకు ఆయనకు రూ. 1కోటిని ఇస్తామని ఆఫర్ ఇచ్చారట.. కానీ, ఆ ఆఫర్‌ను ఆయన అంగీకరించలేదట.. సినిమాల్లో నటించమని చాలా మంది అడిగితే తనకి పాడడం తప్ప మరొకటి నచ్చదని ఓ ఇంటర్వ్యూలో కేకే వెల్లడించారు. కేకేకి భార్య ఇద్దరు పిల్లలున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com