Kousalya : కరోనా లక్షణాలు తీవ్రంగా ఉన్నాయి.. బెడ్‌పై నుంచి కూడా లేవలేకపోతున్నాను : కౌసల్య

Kousalya : కరోనా మహమ్మారి మళ్ళీ తన పంజా విసురుతోంది. రోజురోజుకూ కేసులు పెరుగుతున్నాయి. మహమ్మారి ధాటికి సామాన్యుల నుంచి సెలబ్రిటీలు వరకు ప్రతి ఒక్కరు కరోనా బారిన పడుతున్నారు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ వైరస్ వ్యాపిస్తూనే ఉంది. తాజాగా టాలీవుడ్ సింగర్ కౌసల్యకు కరోనా పాజిటివ్ అని తేలింది. ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది.
'నాకు కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయింది. లక్షణాలు తీవ్రంగానే ఉన్నాయి. ముఖ్యంగా రెండు రోజుల నుంచి ఫీవర్ ఉంది.ఎలాగంటే కనీసం బెడ్ పై నుంచి కూడా లేవలేకపోతున్నాను. దీనికి తోడు ఇప్పుడు గొంతు నొప్పి నన్ను ఎంతగానో ఇబ్బందిపెడుతోంది. నిన్నటి నుంచి మెడిసిన్స్ వేసుకుంటున్నాను... దయచేసి అందరూ జాగ్రత్తలు పాటించండి సురక్షితంగా ఉండండి అంటూ పోస్ట్ పెట్టింది కౌసల్య. ఇక ఆమె త్వరగా కోలుకోవాలని సినీ సెలబ్రిటీలతో పాటుగా అభిమానులు కోరుకుంటున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com