Singer Mangli: చెల్లెలి సక్సెస్.. అక్క మంగ్లీ ఎమోషన్..

Singer Mangli: చెల్లెలి సక్సెస్.. అక్క మంగ్లీ ఎమోషన్..
Singer Mangli: ఊఊ అంటావా మావా అంటూ పస్తున్న పాట ఇంద్రావతి చౌహన్ గొంతులో మరింత మత్తుగా సాగింది..

Singer Mangli: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబోలో వస్తున్న పుష్ప గురించి అభిమానులు వెయిటింగ్.. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రంలోని పాటలన్నీ సంచలనం సృష్టించాయి. యూట్యూబ్‌లో మిలియన్ల వ్యూస్ సంపాదించి పెట్టాయి. పక్కా మాస్ పాత్ర పోషించిన అల్లు అర్జున్ తన స్టైల్ ఇమేజ్‌ని పక్కన పెట్టి పాత్ర కోసం ఒదిగిపోయాడు.. గ్లామర్ బ్యూటీ రష్మిక మంథన కూడా అర్జున్‌కి ఏ మాత్రం తగ్గకుండా నటించినట్లు ట్రైలర్ చూస్తే తెలుస్తోంది.

ప్రమోషన్ల ద్వారా హైప్ క్రియేట్ చేసిన పుష్ప బాక్సాఫీస్ రికార్డులను షేక్ చేస్తుందనడంలో అతిశయోక్తి కాదు. ఇక ఈ సినిమాలో ప్రస్తుతం హాట్ టాపిగ్గా మారింది మాత్రం ఊ అంటావా మావా.. ఊఊ అంటావా మావా అంటూ పస్తున్న పాట ఇంద్రావతి చౌహన్ గొంతులో మరింత మత్తుగా సాగింది.. దానికి తోడు సమంత డ్యాన్స్.. అద్దిరిపోయిందంతే అంటున్నారు ఫ్యాన్స్. స్టార్ హీరోయిన్ అయినా స్పెషల్ సాంగ్‌లో నటించి శెభాష్ అనిపించుకుంది.

మంచి మార్కులు కొట్టేసింది. ఇదంతా ఒకెత్తు అయితే ఈ పాట లిరికల్ వీడియోలో ఇంద్రావతి ఇచ్చిన ఎక్స్‌ప్రెషన్స్ మరో ఎత్తు. ఈ పాటతో ఇంద్రావతి క్రేజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. ప్రముఖ ఫోక్ సింగ్ సింగర్ మంగ్లీ చెల్లెలు ఇంద్రావతి.. చెల్లెలికి వస్తున్న పేరు చూసి అక్క మంగ్లీ మురిసిపోతోంది. సోషల్ మీడియా వేదికగా తన చెల్లెలి విజయం గురించి ఎమోషనల్ పోస్ట్ చేసింది.

నువు పాడిన ఊ అంటావా మావా పాట నాలుగు రోజుల్లోనే 3 కోట్ల వ్యూస్‌ను రాబట్టింది. ఇంత పెద్ద విజయం సాధించడం నాకు చాలా ఆనందంగా ఉంది. నీ మొదటి సినిమాతోనే ఇంతటి విజయాన్ని అందుకున్నావు. ముందు ముందు మరిన్ని విజయాలు అందుకోవాలని కోరుకుంటున్నాను. దేవీ శ్రీ ప్రసాద్, సుకుమార్ సర్, అల్లు అర్జున్ సర్, చంద్రబోస్ అన్న ఇలా అందరికీ థ్యాంక్యూ.. అని మంగ్లీ తన సంతోషాన్ని తెలియజేసింది.

Tags

Read MoreRead Less
Next Story