Singer Mano: 'ఫుల్ బాటిల్ ఎటూ లేదు.. పెగ్ అయినా కొట్టు బ్రదర్'.. మందుబాబులకు కిక్కిచ్చే పాట..

Singer Mano (tv5news.in)
Singer Mano: సీనియర్ సింగర్ మనో.. ఎన్నో సంవత్సరాల నుండి టాలీవుడ్‌లోని కాదు దేశంలోని పలు భాషల్లో సింగర్‌గా, డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా ప్రేక్షకులను మెప్పిస్తున్నారు. ఇటీవల బుల్లితెరపై కూడా ఆయన సందడి మొదలయ్యింది. పేరడీ పాటలకు కూడా మనో పెట్టింది పేరు. అప్పటికి అప్పుడు పేరడీ పాటలను రాసేసి అందరినీ నవ్వించడంలో ఆయన దిట్ట. అలా చాలాకాలం క్రితం మందుబాబులపై ఆయన రాసిన ఓ పేరడీ పాట ప్రస్తుతం వాట్సాప్‌లో వైరల్ అవుతోంది.
న్యూ ఇయర్ అనగానే ఏజ్‌తో సంబంధం లేకుండా చాలామందికి గుర్తొచ్చేది పార్టీలు, పబ్‌లు. టీనేజ్‌లో ఉన్నవారు పబ్‌లకు వెళ్లి న్యూ ఇయర్‌ను వెల్‌కమ్ చేస్తే.. టీనేజ్ దాటేసిన అంకుల్స్ మేడపై మందు బాటిల్‌తో, డీజే పాటలతో ఎంజాయ్ చేస్తారు. కానీ అన్నింటిలో మందు మాత్రం కామన్. అందుకే ప్రభుత్వం కూడా వారిని సంతోషపెట్టడానికి వైన్స్, పబ్స్ సమయాన్ని పొడగించింది. అలాంటి వారి కోసమే మనో ఓ పాటను అంకితం చేశారు.
సాపాటు ఎటు లేదు.. పాటైనా పాడు బ్రదర్ అనే పాట అప్పట్లోనే కాదు.. ఇప్పటికీ చాలా ఫేమస్. ఆ పాటకు పేరడీగా ఫుల్ బాటిల్ ఎటూ లేదు.. పెగ్ అయినా కొట్టు బ్రదర్ అంటూ మనో పాటిన పాట మందుబాబుల మనసు దోచుకుంటోంది. ఎక్కడో మరుగున పడిపోయిన ఈ పాట.. న్యూ ఇయర్ సందర్భంగా మరోసారి వైరల్ అవుతోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com