ఎమ్మెల్యే అభ్యర్థిగా రాహుల్ సిప్లిగంజ్.. క్లారిటీ ఇచ్చిన గాయకుడు

ఎమ్మెల్యే అభ్యర్థిగా రాహుల్ సిప్లిగంజ్.. క్లారిటీ ఇచ్చిన గాయకుడు
నిప్పులేందే పొగ రాదంటారు.. అయినా సదరు వ్యక్తులు వచ్చి ఖండిస్తేనే కానీ అవి వట్టి పుకార్లు అని నమ్ముతారు..

నిప్పులేందే పొగ రాదంటారు.. అయినా సదరు వ్యక్తులు వచ్చి ఖండిస్తేనే కానీ అవి వట్టి పుకార్లు అని నమ్ముతారు.. ఇప్పుడు తెలంగాణ గాయకుడు రాహుల్ సిప్లిగంజ్ పరిస్థితి అదే. ఎమ్మెల్యే అభ్యర్థిగా తాను గోషామహల్ నుంచి పోటీచేస్తున్నట్లు వస్తున్న వార్తలను ఖండించాడు.

తనకు రాజకీయ రంగ ప్రవేశం చేసే ఉద్దేశం లేదని, గోషామహల్ ఎమ్మెల్యే స్థానానికి తాను అభ్యర్థిత్వాన్ని సూచిస్తున్నట్లు వస్తున్న వార్తలన్నీ పూర్తిగా అవాస్తవమని రాహుల్ స్పష్టం చేశారు.

టాలీవుడ్ ప్లేబ్యాక్ సింగర్ రాహుల్ తన అభిమానులను మరియు ప్రజలను ఉద్దేశించి, “అందరికీ నమస్కారం! నేను ఏ రాజకీయ పార్టీలోనూ లేను. అవన్నీ గత కొద్ది రోజులుగా ప్రచారంలో ఉన్న ఫేక్ న్యూస్. అది అస్సలు నిజం కాదు. నేను అన్ని పార్టీలకు చెందిన నాయకులందరినీ గౌరవిస్తాను. ఎందుకంటే నేను ఒక కళాకారుడిని, అందరినీ అలరించాలి.. జీవితాంతం అదే దృష్టితో పని చేస్తాను. సింగర్ గానే కొనసాగుతాను అని రాహుల్ అన్నారు.

సిప్లిగంజ్ తన సంగీత వృత్తిపై ఉన్న తన నిబద్ధతను పేర్కొన్నారు. “నేను నా సంగీత వృత్తిలో మాత్రమే ఉన్నాను. ఈ పరిశ్రమలో నేను చేయాల్సింది చాలా ఉంది. ఏ పార్టీ నుంచి నన్ను ఎవరూ సంప్రదించలేదు, నేను ఎవరినీ సంప్రదించలేదు. దయచేసి ఇలాంటి పుకార్లు ఆపండి అని తన అభిమానులను కోరారు.

Tags

Read MoreRead Less
Next Story