Singer Revanth : త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్న సింగర్ రేవంత్..!

Singer Revanth :  త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్న  సింగర్ రేవంత్..!
X
Singer Revanth : తెలుగు ప్లే బ్యాక్ సింగర్ రేవంత్ త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్నాడు. డిసెంబర్‌24న అన్విత అనే అమ్మాయితో రేవంత్‌ నిశ్చితార్థం వైభవంగా జరిగింది.

Singer Revanth : తెలుగు ప్లే బ్యాక్ సింగర్ రేవంత్ త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్నాడు. డిసెంబర్‌24న అన్విత అనే అమ్మాయితో రేవంత్‌ నిశ్చితార్థం వైభవంగా జరిగింది.దీనికి సంబంధించిన ఫోటోలను రేవంత్ తన ఇన్‌‌‌స్టాగ్రామ్ లో పోస్ట్ చేయగా అవి వైరల్‌‌గా మారాయి. దీంతో పలువురు నెటిజన్లతో పాటుగా సెలబ్రిటీలు రేవంత్‌‌కి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. కాగా అన్విత గురించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉన్నాయి. ఇక రేవంత్ టాలీవుడ్‌‌లో పలు పాటలు పాడి మంచి సింగర్‌‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు. బాహుబలి పార్ట్‌-1లో మనోహరి పాటతో దేశ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు.

Tags

Next Story