సినిమా

Sid Sriram: సిద్ శ్రీరామ్‌కు క్రేజీ ఆఫర్.. స్టార్ డైరెక్టర్ సినిమాలో హీరోగా..

Sid Sriram: మరో ఆలోచన చేయకుండా ఓకే చెప్పేశాడు.

Sid Sriram: సిద్ శ్రీరామ్‌కు క్రేజీ ఆఫర్.. స్టార్ డైరెక్టర్ సినిమాలో హీరోగా..
X

Sid Sriram: సామజవరగమనా.. నిను చూసి ఆగగలనా అని మొన్నటికి మొన్న అల వైకుంఠపురంలో అల్లు అర్జున్ కోసం పాడిన పాట మన చెవుల్లో వినసొంపుగా వినపడతూనే ఉంది.. సిద్ శ్రీరామ్ ఏ పాట పాడినా ఆ పాటకే అందం వచ్చేలా ఆయన గొంతు.. హీరోకి ఏ మాత్రం తీసిపోని అందం కూడా అతగాడిది.. అందుకేనేమో ప్రముఖ దర్శకుడు మణిరత్నం కంట్లో పడ్డారు..

ఆయన చేస్తున్న లేటెస్ట్ ప్రాజెక్టులో హీరోగా సిద్ శ్రీరామ్‌ని ఎంపిక చేశారు. నటించాలని లేకపోయినా, సింగర్‌‌గా స్థిరపడాలని ఉన్నా మణిరత్నంలాంటి దర్శకుడు పిలిచి ఆఫర్ ఇస్తే కాదనుకోవడంలో అర్థం ఉండదు అని ఆలోచించాడు.. మరో ఆలోచన చేయకుండా ఓకే చెప్పేశాడు. అయితే ఇంతకు ముందు మణిరత్నం దర్శకత్వం వహించిన 'కడలి' చిత్రంతోనే శ్రీరామ్ 'అదియే' గా నటించారు. ఆ అవకాశంతోనే అతడు మరింత పాపులర్ అయ్యాడు.

ప్రస్తుతం దర్శకుడు మణిరత్నం విభిన్నమైన కథాంశంతో ఓ చిత్రాన్ని తెరకెక్కించనున్నారని సమాచారం. కొత్త సినిమాలో ప్లేబ్యాక్ సింగర్ సిద్ శ్రీరామ్ ప్రధాన పాత్రలో నటించనున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి జయమోహన్ స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. మణిరత్నం నిర్మించిన 'వనం కొట్టత్తుమ్' చిత్రానికి సిద్ శ్రీరామ్ సంగీత స్వరకర్తగా పనిచేశాడు.

Next Story

RELATED STORIES