భావోద్వేగానికి గురైన కమల్.. బాలు ఆరోగ్య పరిస్థితిపై టెన్షన్

భావోద్వేగానికి గురైన కమల్.. బాలు ఆరోగ్య పరిస్థితిపై టెన్షన్
ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఎలా ఉన్నారు..? ఉన్నట్టుండి మళ్లీ ఆరోగ్యం ఎందుకు విషమించింది..? మ్యాగ్జిమం లైఫ్ సపోర్ట్‌పై ఉన్న SPBకి వైద్యులు ఎలాంటి ట్రీట్‌మెంట్ చేస్తున్నారు..

ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఎలా ఉన్నారు..? ఉన్నట్టుండి మళ్లీ ఆరోగ్యం ఎందుకు విషమించింది..? మ్యాగ్జిమం లైఫ్ సపోర్ట్‌పై ఉన్న SPBకి వైద్యులు ఎలాంటి ట్రీట్‌మెంట్ చేస్తున్నారు.. హెల్త్ బులెటిన్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు..! దేశవ్యాప్తంగా ఇప్పుడంతా ఎస్పీబీ క్షేమ సమచారం తెలుసుకునేందుకు వేయికళ్లతో ఎదురు చూస్తున్నారు. చెన్నైలోని MGM ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాలు ఆరోగ్యం అంతకంతకూ క్షీణిస్తుండడంతో నిపుణులైన వైద్యులకు కూడా ఏం చేయాలో అంతుచిక్కడం లేదు. 10 మంది స్పెషలిస్టుల బృందం పర్యవేక్షణలో బాలుకు ఎక్మో, వెంటిలేటర్‌పై చికిత్స కొనసాగుతోంది. కాసేపట్లో హెల్త్‌ బులెటిన్‌ విడుదలయ్యే అవకాశం ఉంది. తమిళనాడు వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి కూడా కాసేపట్లో ఆస్పత్రికి చేరుకోనున్నారు.

బాలు కోలుకున్నారు, నోటి ద్వారా ఆహారం తీసుకుంటున్నారు, ఫిజియో థెరపీ కూడా కొనసాగుతోంది, కనీసం 20 నిమిషాలు కూర్చోగలుగుతున్నారు అంటూ ఆయన కుమారుడు చెప్పడంతో హమ్మయ్య అని ఊపిరిపీల్చుకున్న అభిమానుల్లో ఆ ఆనందం ఎక్కువసేపు నిలవలేదు. నిన్న సాయంత్రం ఊపిరితిత్తుల్లో సమస్యతో ఒక్కసారిగా SPB ఆపస్మారక స్థితికి వెళ్లిపోయారు. ఈ వార్త తెలియగానే హుటాహుటిన కుటుంబ సభ్యులంతా MGM ఆస్పత్రికి చేరుకున్నారు. కమల్ కూడా ఆస్పత్రికి వెళ్లి చూసొచ్చారు. తర్వాత మీడియాతో మాట్లాడుతూ కమల్ చేసిన వ్యాఖ్యలతో అభిమానుల్లో ఆందోళన మరింత పెరిగిపోయింది. బాలును చూశాక.. క్షేమంగా ఉన్నారని చెప్పలేనంటూ కమల్ భావోద్వేదానికి గురవడంతో ఆరోగ్య పరిస్థితిపై అందర్లోనూ టెన్షన్ కనిపిస్తోంది.

ఆగస్టు 5న కరోనా బారినపడ్డప్పటి నుంచి ఆలస్యం చేయకుండా చికిత్స తీసుకుంటున్నారు బాలు. తన ఆరోగ్యం బాగానే ఉందని, ఎవరూ కంగారు పడొద్దని, ఫోన్లు చెయ్యొద్దని కోరుతూ ఓ సెల్ఫీ వీడియో కూడా రిలీజ్ చేశారు. MGMలో చేరిన తర్వాత రకరకాల వదంతులు రావడంతో ఆయన కుమారుడు చరణ్ ఎప్పటికప్పుడు హెల్త్ అప్‌డేట్స్‌ను స్వయంగా చెప్తూ వచ్చారు. అంతా ఆశాజనకంగానే ఉందనుకుంటున్న సమయంలో నిన్న ఒక్కసారిగా పరిస్థితులు తారుమారై ఆరోగ్యం విషమించడంతో కుటుంబసభ్యులు షాక్‌కి గురయ్యారు.

Tags

Read MoreRead Less
Next Story