Singer Sunitha: ఎట్టకేలకు సునీతను ఒప్పించిన దర్శకుడు.. నటిగా సినిమాల్లోకి..

Singer Sunitha: సినిమా తారలకు తీసిపోని అందం. బహుముఖ ప్రజ్ఞాశాలి సింగర్ సునీత. కొన్ని వందల సినిమాలకు డబ్బింగ్, కొన్ని వేల పాటలు పాడి ఇప్పటికే తనకంటూ ఇండస్ట్రీలో ఓ ఇమేజ్‌ని క్రియేట్ చేసుకున్నారు.
తన మృదు మధురమైన గళంలో పాటకు మరింత అందం వస్తుంది. అలాంటి సునీతకు సినిమాల్లో నటించమంటూ ఆఫర్లు అంతకు ముందే చాలా సార్లు వచ్చినా సున్నితంగా నో చెప్పారు సునీత. కానీ ఇప్పుడు త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తున్న మహేష్ బాబు చిత్రంలో అతడికి అక్కగా నటించేందుకు సునీత ఓకే చెప్పినట్లు తెలుస్తోంది.
#SSMB 28 అనే వర్కింగ్ టైటిల్‌తో రూపొందుతోన్న ఈ మూవీ ప్రస్తుతం షూటింగ్‌ను జరుపుకుంటుంది. ఈ చిత్రానికి సంబంధించిన ఓ కీలక పాత్ర కోసం త్రివిక్రమ్ సునీతను సంప్రదించారట. పాత్ర నచ్డడంతో సునీత నటించేందుకు అంగీకరించింది అని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. మరి ఈ వార్తల్లో నిజమెంతుందో తెలియాలంటే అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com