Sunitha : సింగర్ సునీత అంటే సాఫ్ట్ అనుకున్నారా.. ఫైర్.. నెటిజన్ కామెంట్‌‌కు ఘాటు రిప్లై

Sunitha :  సింగర్ సునీత అంటే సాఫ్ట్ అనుకున్నారా.. ఫైర్.. నెటిజన్ కామెంట్‌‌కు ఘాటు రిప్లై
Sunitha : సింగర్ సునీత సోషల్ మీడియాలో ఈ మధ్య యాక్టివ్‌‌గా ఉంటున్నారు. ఎప్పటికప్పుడు తన లేటేస్ట్ ఫోటోస్, వీడియోస్ షేర్ చేస్తూ సందడి చేస్తున్నారు.

Sunitha : సింగర్ సునీత సోషల్ మీడియాలో ఈ మధ్య యాక్టివ్‌‌గా ఉంటున్నారు. ఎప్పటికప్పుడు తన లేటేస్ట్ ఫోటోస్, వీడియోస్ షేర్ చేస్తూ సందడి చేస్తున్నారు. అయితే తనపైన కానీ, తన కుటుంబం పైన కానీ ఎవరైనా కామెంట్స్ చేస్తే పెద్దగా పట్టించుకోరు సునీత.. అయితే ఆ కామెంట్స్ శృతి మించితే మాత్రం అంతేస్థాయిలో కౌంటర్ ఇస్తారు సునీత. తాజాగా తన భర్త రామ్ వీరపనేనితో కలిసి ఓ ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది సునీత.

ఈ ఫోటోను ఉద్దేశిస్తూ ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. నెటిజన్ కామెంట్ పైన సునీత ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆ నెటిజన్‌‌కి తనదైన శైలిలో సమాధానం ఇచ్చింది. సునీత ఇచ్చిన రిప్లైకు నెటిజన్స్ కూడా మద్దతు తెలుపుతున్నారు. అతనికి సరైన రీతిలో గుణపాఠం చెప్పారంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఆ తర్వాత సునీత తన అభిమానులను ఉద్దేశిస్తూ మరో కామెంట్ చేసింది.

" మై డియర్ ఫ్రెండ్స్ నాపై మీకున్న గౌరవానికి, అభిమానానికి నేనెప్పటికి ఋణపడి ఉంటాను. అనుకోకుండా ఇలాంటి ఒక కామెంట్ ద్వారా నాకోసం నిలబడే నా శ్రేయోభిలాషులు ఇంతమంది వున్నారని తెలుసుకుని గర్వపడుతున్నాను. ఎన్నో చూశాను, చూస్తూనే వున్నాను. అయినా ఎప్పుడూ ఎవరినీ ద్వేషించే గుణం రాలేదు. ఇక్కడితో వదిలేద్దాం" అంటూ కామెంట్ చేసింది సునీత.



Tags

Read MoreRead Less
Next Story