సింగర్ సునీత ప్రీవెడ్డింగ్ పార్టీ.. సందడి చేసిన సుమ, రేణూదేశాయ్

సింగర్ సునీత ప్రీవెడ్డింగ్ పార్టీ.. సందడి చేసిన సుమ, రేణూదేశాయ్
అయితే ఈ లోపు ప్రీ వెడ్డింగ్ పార్టీని రామ్‌కి అత్యంత సన్నిహితుడైన హీరో

తన శ్రావ్యమైన గొంతుతో ప్రేక్షకులను మంత్ర ముగ్ధులను చేసే గాయని సునీతా ఉపద్రష్ట హైదరాబాద్‌కు చెందిన రామ్ వీరపనేని అనే వ్యాపారవేత్తతో జీవితాన్ని పంచుకుంటున్నట్లు ఇటీవల వెల్లడించింది. నిశ్చితార్ధం జరిగిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. కొన్ని అనివార్య కారణాల వల్ల వివాహతేదీని వాయిదా వేసినట్లు తెలిసింది. అయితే ఈ లోపు ప్రీ వెడ్డింగ్ పార్టీని రామ్‌కి అత్యంత సన్నిహితుడైన హీరో నితిన్ ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది.

గచ్చిబౌలిలోని ఓ స్టార్ హోటల్‌లో జరిగిన పార్టీలో సునీత, రామ్‌లు కేక్ కట్ చేసి సందడి చేశారు. డిసెంబర్ 19 రాత్రి జరిగిన ఈపార్టీకి పలువురు టాలీవుడ్ సెలబ్రెటీలు హాజరయ్యారు. రామ్, సునీతలకు సంబంధించిన అత్యంత సన్నిహితులు, కుటుంబసభ్యులు హాజరయ్యారు. ఈ వేడుకలకు సంబంధించిన కొన్ని చిత్రాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

కాగా, సునీతకు డిసెంబర్ 7 న రామ్‌తో నిశ్చితార్థం జరిగింది. తాను కొత్త జీవితాన్ని ప్రారంభిస్తున్నానంటూ నిశ్చితార్ధానికి సంబంధించిన ఫోటోలను సునీత సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. "ప్రతి తల్లిలాగే, నా పిల్లలు కూడా బాగా స్థిరపరడాలని నేను కలలు కంటున్నాను. అదే సమయంలో, నా జీవితం కూడా బావుండాలని నా పిల్లలు ఆలోచించారు.

ఇలాంటి అద్భుతమైన పిల్లలతో నా భవిష్యత్ గురించి ఆలోచించే తల్లిదండ్రులు ఉన్నందుకు నేనెంతో అదృష్టవంతురాలిని. వారి ఆశీర్వాదాలతో నేను జీవితంలో స్థిరపడే రోజు వచ్చింది. రామ్‌తో నా జీవితాన్ని పంచుకుంటున్నాను. రామ్ నా జీవితంలోకి ప్రవేశించిన ఓ మంచి స్నేహితుడు, అద్భుతమైన భాగస్వామి అంటూ సునీత పోస్ట్ పెట్టింది.

నేను నా జీవితానికి సంబంధించిన విషయాలను గోప్యంగా ఉంచుతున్నందుకు క్షమించండి. అర్ధం చేసుకుంటారని ఆశిస్తున్నాను. నా వెంటే ఉంటూ నన్ను ప్రోత్సహిస్తున్న అభిమానులు, శ్రేయోభిలాషులందరికీ నా ధన్యవాదాలు. దయచేసి మీరు ఎప్పటిలాగే నాకు సపోర్ట్ చేస్తారని నాతోనే ఉంటారని అభిలషిస్తున్నానంటూ ఆమె పోస్ట్ పెట్టారు.

Tags

Next Story