Singer Sunitha: 'దండం రా నాయనా'.. వైరల్ పోస్ట్‌పై సునీత రియాక్షన్..

Singer Sunitha: సినీ సెలబ్రిటీలపై ప్రేక్షకుల ఫోకస్ ఎప్పుడూ ఉంటుంది. ముఖ్యంగా వారి సోషల్ మీడియాలో వారు పెట్టే పోస్టులు ఎప్పటికప్పుడు వైరల్ అవుతూనే ఉంటాయి. అలాగే తాజాగా సింగర్ సునీత పెట్టిన పోస్టును డీకోడ్ చేసి తను ప్రెగ్నెంట్ అని నిర్ధారించేశారు కొందరు. అయితే ఈ వార్తలపై సునీత కూడా వెంటనే స్పందించింది.
చిన్న వయసులోనే పెళ్లి చేసుకున్న సింగర్ సునీత.. కొన్నాళ్ల తర్వాత విడాకులు తీసుకుంది. ఇక కొంతకాలం క్రితం వ్యాపారవేత్త రామకృష్ణ వీరపనేనితో సునీత రెండో వివాహం జరిగింది. తాజాగా ఓ మామిడి చెట్టు దగ్గర మామిడి కాయను పట్టుకుని 'బ్లెస్డ్' అనే క్యాప్షన్‌తో ఫోటోను పోస్ట్ చేసింది సునీత. దీంతో సునీత తల్లి కాబోతుందా అని రూమర్స్ మొదలయిపోయాయి. దీనికి సునీత స్పందిస్తూ మరో పోస్ట్ పెట్టింది.
'ఓరి దేవుడా.. జనాలు ఎంత క్రేజీ అసలు. నేను మా మొదటి మామిడి పంటతో ఈరోజు ఒక ఫోటోను పోస్ట్ చేశాను. ఆ వార్త ఇలా వ్యాపించింది. లేని విషయాలను ఊహించుకోకండి. రూమర్స్‌ను వ్యాపించేలా చేయకండి. దండం రా నాయనా' అంటూ ఈ వార్తలపై స్పందించింది సునీత.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com