Singham Again: 'లేడీ సింగం' వచ్చేసింది.. పోస్టర్స్ రిలీజ్

దీపికా పదుకొణె నటిస్తోన్న లేటెస్ట్ చిత్రం 'లేడీ సింగం' ఫస్ట్ లుక్ పోస్టర్లు ఎట్టకేలకు విడుదలయ్యాయి. ప్రేక్షకులు ఈ సమయం కోసం ఎప్పట్నుంచో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజా పోస్టర్లతో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఎట్టకేలకు రోహిత్ శెట్టి కాప్ యూనివర్స్‌లోకి ప్రవేశించిన దీపికా.. ఈ సినిమాలో 'శక్తి శెట్టి' పాత్రలో నటిసోంది. ఈ సందర్భంగా తాజాగా దీపికా పదుకొణె ఈ చిత్రం నుండి రెండు పోస్టర్‌లను పంచుకుంది. మొదటి పోస్టర్‌లో, దీపిక గూండాల కుప్పపై కూర్చొని కనిపించగా, రెండవ పోస్టర్‌లో చేతిలో తుపాకీ పట్టుకుని క్రూరంగా కనిపించింది. శక్తి శెట్టిగా సింగం మళ్లీ వస్తోంది అనే క్యాప్షన్ తో ఆమె ఈ ఫొటోలను షేర్ చేసింది. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
దీపికా భర్త, బాలీవుడ్ నటుడు రణవీర్ సింగ్ కూడా అంతకుముందు తన భార్యపై ప్రశంసల వర్షం కురిపించాడు. 'ఆమె నటన ఇరగదీస్తుంది' అని సోషల్ మీడియా ద్వారా తెలిపాడు. అతను తన ఇన్‌స్టా ప్రొఫైల్‌లో పోస్టర్‌ను షేర్ చేశాడు. 'ఆలీ రే ఆలీ.. లేడీ సింగం ఆలీ!!! శక్తి శెట్టి వచ్చారు!!!' అనే క్యాప్షన్ ను కూడా దీనికి జోడించారు.
దీపికా పదుకొణె చివరిగా షారుఖ్ ఖాన్ నటించిన 'జవాన్' చిత్రంలో కనిపించింది. ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద ఇప్పటికే 1,000 కోట్ల రూపాయలకు పైగా వసూలు చేసిన ఈ చిత్రం ఇప్పటికీ థియేటర్లలో రన్ అవుతోంది. ఆమె తదుపరి నాగ్ అశ్విన్ 'కల్కి 2898' AD లో ప్రభాస్ సరసన నటిస్తోంది. ఇవి కాకుండా, ఆమె కిట్టిలో సిద్ధార్థ్ ఆనంద్ 'ఫైటర్' కూడా ఉంది. ఆమె హృతిక్ రోషన్‌తో మొదటిసారి స్క్రీన్ స్పేస్‌ను పంచుకోనున్నారు. ఈ సినిమాను జనవరి 2024లో విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.
DEEPIKA PADUKONE AS LADY SINGHAM: ROHIT SHETTY UNVEILS FEROCIOUS LOOK… #RohitShetty expands the cop universe as he welcomes #DeepikaPadukone - the first female cop #LadySingham - in the highly anticipated #SinghamAgain.#SinghamAgain is the third part in #RohitShetty’s… pic.twitter.com/fEkVCvXAJP
— taran adarsh (@taran_adarsh) October 15, 2023
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com