Siri Hanmanth: బిగ్ బాస్ సిరికి కరోనా..

Siri Hanmanth (tv5news.in)
Siri Hanmanth: సినీ పరిశ్రమలో కోవిడ్ కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. ఇప్పటికే చాలామంది టాలీవుడ్ నటీనటులు కరోనా బారిన పడ్డారు. వారిలో కొందరు హోమ్ ఐసోలేషన్‌లో ఉండగా.. మరికొందరు ఆసుపత్రులలో చికిత్స్ తీసుకుంటున్నారు. తాజగా బిగ్ బాస్ 5 తెలుగుతో బుల్లితెర ప్రేక్షకులకు దగ్గరయిన సిరి హన్మంత్‌కు పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్టు తన సోషల్ మీడియాలో ప్రకటించింది.
బిగ్ బాస్ ముందు వరకు సిరి హన్మంత్ అంటే పెద్దగా ఎవరికీ తెలీదు. యూట్యూబ్‌ను ఎక్కువగా ఫాలో అయ్యేవారు, వెబ్ సిరీస్, షార్ట్ ఫిల్మ్స్ ఎక్కువగా చూసే అలవాటు ఉన్నవారికి మాత్రమే సిరి పరిచయం. కానీ ఒక్కసారి బిగ్ బాస్ హౌస్‌లోకి వచ్చిన తర్వాత సిరి అంటే అందరికీ తెలిసింది. ముఖ్యంగా షణ్నూతో ఫ్రెండ్‌షిప్ తనకు చాలా ప్లస్ అయ్యింది. అందరినీ దాటుకుంటూ సిరి ఏకంగా టాప్ 5 కంటెస్టెంట్స్‌లో ఒకరిగా నిలిచింది.
బిగ్ బాస్ హౌస్ నుండి బయటికి వచ్చిన తర్వాత అంతకు ముందులాగా సోషల్ మీడియాలో ఎక్కువగా యాక్టివ్‌గా ఉండడం లేదు. తాజాగా తనకు కరోనా నిర్దారణ అయినట్టు. మైల్డ్ సింప్టమ్స్ ఉన్నట్టు ఇన్‌స్టాగ్రామ్ ద్వారా స్పష్టం చేసింది. ఇక షణ్నూ, దీప్తి సునయన లాగానే సిరికి, తన బాయ్‌ఫ్రెండ్ శ్రీహాన్‌కు కూడా బ్రేకప్ అవుతుందా అన్న విషయంలో ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా నడుస్తోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com