sirivennela seetharama sastry : తనకు అహంకారం ఎక్కువని అయినా .. దానిముందు తలొంచానన్న సీతారామశాస్త్రి..!

sirivennela seetharama sastry : తనకు అహంకారం ఎక్కువని అయినా .. దానిముందు తలొంచానన్న సీతారామశాస్త్రి..!
sirivennela seetharama sastry : గతంలో ఓ ఇంటర్వ్యూలో స్మోకింగ్ పై కామెంట్స్ చేశారు సిరివెన్నెల. ఆ ఇంటర్వ్యూలో తనకి చిన్నప్పటి నుంచే స్మోకింగ్ అలవాటుందని అన్నారు.

sirivennela seetharama sastry : కొన్ని వేల పాటలతో తనదైన సాహిత్యంతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రీ (66) కన్నుమూశారు.. ఊపిరితిత్తుల క్యాన్సర్‌ సంబంధిత సమస్యలతో బాధపడుతూ ఈరోజు(మంగళవారం) కిమ్స్ ఆసుపత్రిలో కన్నుమూశారు. సిరివెన్నెలను బతికించేందుకు తాము శాయశక్తులా ప్రయత్నించామని, ఆయన బాడీ కూడా సపోర్ట్ చేసిందన్నారు కిమ్స్ ఆస్పత్రి ఎండీ భాస్కర్‌రావు . కానీ ఇన్ఫెక్షన్స్ చాలా ఎక్కువయ్యాయని తెలిపారు. అయితే సిరివెన్నెలకు సిగరెట్‌ అలవాటు బాగా ఉండడంతో ఆయనకి ఈ ఇన్ఫెక్షన్స్ సోకినట్టు తెలుస్తోంది.

గతంలో ఓ ఇంటర్వ్యూలో స్మోకింగ్ పై కామెంట్స్ చేశారు సిరివెన్నెల. ఆ ఇంటర్వ్యూలో తనకి చిన్నప్పటి నుంచే స్మోకింగ్ అలవాటుందని అన్నారు. అప్పట్లో సిగరెట్ తాగడం ఓ ఫ్యాషన్ అని చెప్పారు. సరదాగా మొదలైన ఈ అలవాటు వ్యసనంగా మారిందని చెప్పారు. అసలే తనకు అహంకారం ఎక్కువని.. కానీ సిగరెట్ ముందు ప్రతిసారి తలవంచుతున్నానని చెప్పుకొచ్చారు. తన పిల్లలకు కూడా అదే విషయాన్ని చెప్పిన్నట్లు తెలిపారు. అయితే పబ్లిక్ ప్లేస్, చిన్నపిల్లలు, ఆడవాళ్లు ముందు మాత్రం సిగరెట్ కాల్చొద్దనే నియమాన్ని తనకి తాను పెట్టుకున్నట్టుగా ఆ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. కాగా సీతారామశాస్త్రి అంత్యక్రియలు రేపు (బుధవారం) మహాప్రస్థానంలో జరగనున్నాయి.

Tags

Read MoreRead Less
Next Story