sirivennela seetharama sastry: మరికాసేపట్లో సిరివెన్నెల సీతారామశాస్త్రి అంత్యక్రియలు..

sirivennela seetharama sastry: మరికాసేపట్లో సిరివెన్నెల సీతారామశాస్త్రి అంత్యక్రియలు..
sirivennela seetharama sastry: మరికాసేపట్లో సిరివెన్నెల సీతారామశాస్త్రి అంత్యక్రియలు మొదలుకానున్నాయి.

sirivennela seetharama sastry: మరికాసేపట్లో సిరివెన్నెల సీతారామశాస్త్రి అంత్యక్రియలు మొదలుకానున్నాయి. అభిమానుల అశ్రునయనాల మధ్య కొద్దిసేటి కిందటే ఆయన పార్థివదేహం మహాప్రస్థానానికి చేరుకుంది. ఫిల్మ్‌నగర్‌లోని మహాప్రస్థానం వరకూ సాగిన ఈ ర్యాలీలో సినీప్రముఖులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. కోట్లాది మంది అభిమానుల అశ్రునయనాల మధ్య సిరివెన్నెల అంతిమయాత్ర కొనసాగుతోంది.

ఫిల్మ్‌నగర్‌లోని మహాప్రస్థానం వరకూ సాగుతున్న ఈ ర్యాలీలో సినీప్రముఖులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. ఇవాళ ఉదయం సిరివెన్నెల సీతారామశాస్త్రి పార్థివదేహం ఫిల్మ్‌ ఛాంబర్‌కు చేరుకుంది. అక్కడ సినీ, రాజకీయ, పారిశ్రామికవేత్తలంతా ఆయనకు నివాళులు అర్పించారు. తర్వాత అక్కడి నుంచి అంతిమ సంస్కారాల కోసం ప్రత్యేక వాహనంలో భౌతికకాయాన్ని మహాప్రస్థానానికి తీసుకువెళ్తున్నారు.

కుటుంబ సభ్యులు, బంధుమిత్రులంతా ఇప్పటికే అక్కడికి చేరుకున్నారు. అక్షరసేద్యంతో అద్భుతాలు సృష్టించి, సినీవినీలాకాశంలో తనదైన ముద్ర వేసిన సిరివెన్నెల లేని లోటు ఎవరూ పూడ్చలేనిదంటూ అంతా బరువెక్కిన హృదయాలతో నివాళులు అర్పిస్తున్నారు. సన్నివేశం చెప్తే చాలు.. దానికి దృశ్యరూపం ఇవ్వడంలో సిరివెన్నెల కలానికి తిరుగేలేదు.

ఎందరో ప్రొడ్యూసర్లు ముచ్చటపడి ఆయనతో పాటలు రాయించుకున్నారు. దర్శకులు తమ అభిరుచికి తగ్గట్టు సరికొత్త ప్రయోగాలు చేయించారు. డైరెక్టర్లకు ఏంకావాలో క్లారిటీగా చెప్తే చాలు.. సీతారామశాస్త్రి కలం నుంచి జాలువారే అక్షరాలే మొత్తం దృశ్యాన్ని కళ్లకు కట్టేస్తాయి. సన్నివేశానికి అదనపు బలాన్ని తెచ్చిపెడతాయి.

చాలాసార్లు ఆ పాటల్లోని మాటలే సినిమాకు ఆయువుపట్టుగా మారిన సందర్భాలూ ఉన్నాయి. ఆయనలో గీతరచయిత ఎలాంటి అద్భుతాలు చేస్తాడో చెప్పడానికి నిదర్శనాలు కోకొల్లలు. సాహిత్యానికి పట్టం కడుతూ పాట రాయాలన్నా.. సరళంగా సాగిపోయే పదాలతో యువతను ఉర్రూతలూగించాలన్నా.. అది ఆయనకే చెల్లింది. అందుకే.. ఆయన మరణాన్ని తట్టుకోలేక కోట్ల హృదయాలు మౌనంగా రోదిస్తున్నాయి.

సిరివెన్నెల కురిపించి.. ఇక సెలవంటూ వెళ్లిపోయిన సీతారామశాస్త్రి మరణాన్ని తెలుగు చిత్రసీమ తట్టుకోలేకపోతోంది. ఆ పాటసారిని, ఆయన పాటను ప్రాణంగా ప్రేమించిన వారందరి హృదయాలు ఇప్పుడు అంతులేని వేదనతో సుడిగుండాలు అవుతున్నాయి. మరికాసేపట్లో సిరివెన్నెల అంత్యక్రియలు మహాప్రస్థానంలో జరగనున్నాయి.

మాటలకందని ఈ విషాదం గుండెల్ని పిండేస్తుంటే.. బరువెక్కిన హృదయాలతో అక్కడికి వచ్చిన వారందరికి కళ్లలోనూ నీటిసుడులు తిరుగుతున్నాయి. సినీరంగంతో అనుబంధం ఉన్నవారితోపాటు, రాజకీయ నాయకులు, పారిశ్రామికవేత్తలు అంతా సిరివెన్నెలకు నివాళులు అర్పిస్తున్నారు. ప్రతి ఒక్కరితోనూ ప్రత్యేకమైన అనుబంధాన్ని ఏర్పరుచుకుని, వెలకట్టలేని అభిమానాన్ని పొందారు కాబట్టే.. ఆయన ఇక లేరనే వార్త ఎవరూ జీర్ణించుకోలేకపోతున్నారు.

తెలుగు సినీరంగానికి సీతారామశాస్త్రి లేని లోటు ఎవరూ పూడ్చలేనిదంటూ ఉద్వేగానికి గురవుతున్నారు. ఈ అంతులేని విషాదం అలుముకున్న వేళ.. సిరివెన్నెల కుటుంబాన్ని ఓదార్చడం ఇప్పుడు ఎవరివల్లా కావడం లేదు.

36 ఏళ్ల సినీప్రస్థానం.. 3 వేలకుపైగా పాటలు.. ప్రతిదీ ప్రత్యేకమే.. అనుభవం నేర్పిన పాఠాలతో కాలానికి తగ్గట్టు మారుతూ, తన పాటనూ సరికొత్తగా మలుస్తూ.. పెన్‌ పవర్‌ చూపిస్తూ తనదైన ముద్ర వేశారు సిరివెన్నెల. అందుకే ఇప్పటి కుర్రహీరోలకు సైతం ఫేవరిట్ లిరిసిస్ట్‌గా నిలిచారు. తోటి గీతరచయితలతోనూ చెరిగిపోని, చెదిరిపోని ఆత్మీయబంధం ఏర్పరచుకున్నారు. అందుకే.. సిరివెన్నెల లేరనే నిజాన్ని ఎవరూ తట్టుకోలేకపోతున్నారు.

Tags

Read MoreRead Less
Next Story