sirivennela seetharama sastry: భారీ సంఖ్యలో ఫిల్మ్ ఛాంబర్‌కు చేరుకుంటున్న సిరివెన్నెల అభిమానులు, సినీతారలు..

sirivennela seetharama sastry: కోట్లాది మంది అభిమానుల్ని కన్నీటిసంద్రంలో ముంచేస్తూ.. తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయిన సిరివెన్నెల సీతారామశాస్త్రి కడసారి చూపుల కోసం అంతా ఫిల్మ్ ఛాంబర్‌కు తరలివెళ్తున్నారు. మాటలకందని విషాదం గుండెల్ని పిండేస్తుంటే.. బరువెక్కిన హృదయాలతో అక్కడికి వచ్చిన వారందరికి కళ్లలోనూ నీటిసుడులు తిరుగుతున్నాయి.
అక్కడంతా ఇప్పుడు గంభీరవాతావరణం కనిపిస్తోంది. సినీరంగంతో అనుబంధం ఉన్నవారే కాదు, రాజకీయ నాయకులు, పారిశ్రామికవేత్తలు అంతా సిరివెన్నెలకు శ్రద్ధాంజలి ఘటిస్తున్నారు. ప్రతి ఒక్కరితోనూ ప్రత్యేకమైన అనుబంధాన్ని ఏర్పరుచుకుని, వెలకట్టలేని అభిమానాన్ని పొందారు కాబట్టే.. ఆయన ఇక లేరనే వార్త ఎవరూ జీర్ణించుకోలేకపోతున్నారు. తెలుగు సినీరంగానికి సీతారామశాస్త్రి లేని లోటు ఎవరూ పూడ్చలేనిదంటూ ఉద్వేగానికి గురవుతున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com