సినిమా

Shyam Singha Roy: సిరివెన్నెల ఆఖరి పాట.. చూడచక్కని 'శ్యామ్ సింగరాయ్' డ్యూయట్..

Shyam Singha Roy: సిరివెన్నెల సీతారామశాస్త్రి.. ఆయన మన మధ్య లేరు.

Shyam Singha Roy: సిరివెన్నెల ఆఖరి పాట.. చూడచక్కని శ్యామ్ సింగరాయ్ డ్యూయట్..
X

Shyam Singha Roy: సిరివెన్నెల సీతారామశాస్త్రి.. ఆయన మన మధ్య లేరు. కానీ ఆయన రచన ఉంది. ఆయన రాసిన అక్షరాలు ఉన్నాయి. ఆయన మాటలలో హత్తుకుపోయే భావాలు ఉన్నాయి. సీతారామశాస్త్రి.. ఆయన రాసిన ఆణిముత్యాలలో ఒకటి మనకు పరిచయం చేయకుండానే వెళ్లిపోయారు. అదే శ్యామ్ సింగరాయ్ చిత్రంలో సిరివెన్నెల పాట.

నాని, సాయి పల్లవి, క‌ృతి శెట్టి హీరోహీరోయిన్లుగా రాహుల్ సాంకిృత్యాన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రమే 'శ్యామ్ సింగరాయ్'. ఇప్పటికే ఈ సినిమా టీజర్, రెండు పాటలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఇవన్నీ చూస్తుంటే ఇప్పటివరకు నాని కెరీర్‌లో ఇలాంటి ఓ పాత్ర చేయలేదని స్పష్టమవుతోంది. తాజాగా ఈ సినిమాలో నుండి సిరివెన్నెల సీతారామశాస్త్రి రాసిన 'సిరివెన్నెల' పాటను విడుదల చేసింది మూవీ టీమ్.

సిరివెన్నెల పాట నాని, సాయి పల్లవి మధ్య డ్యూయట్‌గా తెరకెక్కింది. ఇందులో నాని, సాయి పల్లవి ఎప్పటిలాగానే నేచురల్ స్టార్స్‌గా నటించి ఆకట్టుకుంటున్నారు. ముఖ్యంగా బెంగాళి అమ్మాయిగా సాయి పల్లవి చూడచక్కగా ఉంది. సీతారామశాస్త్రి ఎప్పటిలాగానే తన నటనతో మ్యాజిక్ చేశారు. మెలోడీ పాటలను ఇష్టపడే వారికి ఈ పాట వెంటనే నచ్చేసేలా అనిపిస్తోంది.

Next Story

RELATED STORIES