sirivennela seetharama sastry: సిరివెన్నెల తన మరణాన్ని ముందే ఊహించారు అంటున్న దర్శకుడు..
sirivennela seetharama sastry: సిరివెన్నెల సీతారామశాస్త్రి ఆయన తుదిశ్వాస విడిచేవరకు సాహిత్యానికే జీవితాన్ని అంకితం చేశారు. ఆయన ప్రతీ క్షణాన్ని అక్షరంతోనే గడిపేవారు. ఇప్పటికే ఆయన రాసిన మరికొన్ని పాటలు ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది. అందులో 'శ్యామ్ సింగరాయ్' సినిమాలో రాసిన రెండు పాటలు కూడా ఉన్నాయి. ఆ పాటలను దర్శకుడికి అందిస్తున్న సమయంలో జరిగిన ఓ విషయాన్ని మూవీ టీమ్ గుర్తుచేసుకుంది.
నాని, సాయి పల్లవి, కృతి శెట్టి హీరోహీరోయిన్లుగా నటిస్తున్న పాన్ ఇండియా చిత్రమే 'శ్యామ్ సింగరాయ్'. టాక్సీవాలా ఫేమ్ రాహుల్ సాంకిృత్యాన్ దీనికి దర్శకత్వం వహించాడు. అయితే ఇందులో సిరివెన్నెల సీతారామశాస్త్రి రెండు పాటలను రాశారు. ఈ పాటలు రాస్తున్న సమయంలోనే సిరివెన్నెల ఆయన మరణాన్ని ఊహించినట్టున్నారు.
'ఇదే నా చివరి పాట' కావచ్చు అని రాహుల్‌తో అన్నారట సిరివెన్నెల సీతారామశాస్త్రి. ఇటీవల ఈ విషయాన్ని ప్రేక్షకులతో పంచుకున్నాడు రాహుల్. అలా ఎందుకు అన్నారో తెలియదు కానీ ఈరోజు నిజంగానే ఆయన లేరు. ఇక ఆయన పాటలు మనకు ఉండవు. అందుకే ఇందులో ఆయన రాసిన పాటకు సిరివెన్నెల అని పేరు పెట్టింది మూవీ టీమ్.
శ్యామ్ సింగరాయ్‌లో సిరివెన్నెల రాసిన పాటను డిసెంబర్ 7న విడుదల చేయాలని మూవీ టీమ్ నిర్ణయించింది. ఆయన రాసిన మరో పాట కూడా త్వరలోనే విడుదల చేస్తామని వెల్లడించింది. ఈ విషయాన్ని మూవీ టీమ్ అంతా ఓ వీడియో ద్వారా తెలియజేసింది.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com