Raja Chembolu: సిరివెన్నెల కుమారుడు రాజా గురించి ఆసక్తికర విషయాలు ఇవే..

Raja Chembolu: సిరివెన్నెల కుమారుడు రాజా గురించి ఆసక్తికర విషయాలు ఇవే..
Raja Chembolu: సీతారామశాస్త్రి రచయితగా పేరు సంపాదించుకున్నా.. తన కొడుకు రాజా మాత్రం నటుడిగా పేరు తెచ్చుకోవాలనుకున్నాడు.

Raja Chembolu: సిరివెన్నెల సీతారామశాస్త్రి రచయితగా పేరు సంపాదించుకున్నా.. తన కొడుకు రాజా మాత్రం నటుడిగా పేరు తెచ్చుకోవాలనుకున్నాడు. స్క్రీన్‌పై మెరిసి అందరినీ ఆకట్టుకోవాలి అనుకున్నాడు. 'ఫిదా'తో మంచి గుర్తింపు తెచ్చుకున్న రాజా ముందుగా హీరో అవ్వాలనుకున్నాడు. చాలా సంవత్సరాల క్రితమే హీరోగా తన కెరీర్‌ను ప్రారంభించాడు.

2008లో యూత్‌ఫుల్ డైరెక్టర్ తేజ దర్శకత్వంలో తెరకెక్కిన 'కేక' అనే సినిమాతో హీరోగా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు రాజా. కానీ ఈ సినిమా ఆశించినంత గుర్తింపును దక్కించుకోలేకపోయింది. అందుకే మరో సినిమాను సైన్ చేయడం కోసం చాలానే గ్యాప్ తీసుకున్నాడు రాజా. మళ్లీ 2013లో 'తెలుగు భాషలో నాకు నచ్చని పదం ప్రేమ' అనే యూత్‌ఫుల్ డ్రామాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.


హీరోగా చేసిన రెండో ప్రయత్నం కూడా ఫెయిల్ అయ్యింది. 'తెలుగు భాషలో నాకు నచ్చని పదం ప్రేమ' సినిమాలో రాజాతో పాటు మరో హీరో కూడా నటించాడు. అతడే తమిళ స్టార్ డైరెక్టర్ పి వాసు కుమారుడు శక్తి వసుదేవన్. కానీ ఈ ఇద్దరికీ ఈ సినిమా కలిసిరాలేదు. నటుడిగా గుర్తింపు తెచ్చుకోవాలంటే హీరోగా మాత్రమే చేయాల్సిన అవసరం లేదని అర్థం చేసుకున్న రాజా.. 2014లో రామ్ చరణ్, అల్లు అర్జున్ హీరోలుగా వచ్చిన 'ఎవడు' చిత్రంలో ఓ కీలక పాత్రలో కనిపించాడు.


'ఎవడు' తనకు మొదటి చిత్రమే అయినా.. అందులోనే తన విలనిజంతో ఆకట్టుకుని మరికొన్ని సినిమాలలో కీ రోల్స్ చేసే ఛాన్స్ కొట్టేశాడు. ఇక 2017లో శేఖర్ కమ్ముల డైరెక్షన్‌లో వచ్చిన 'ఫిదా' రాజా కెరీర్‌లో బిగ్గెస్ట్ బ్రేక్. అందులో హీరో వరుణ్ తేజ్‌కు అన్న పాత్ర పోషించిన రాజా తన కూల్ యాటిట్యూడ్‌తో ఆకట్టుకుని ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యాడు.


'అంతరిక్షం', 'రణరంగం', నా పేరు సూర్య.. నా ఇల్లు ఇండియా', 'మిస్టర్ మజ్ను' లాంటి సినిమాల్లో మెరిసాడు రాజా. సినిమాల్లోనే కాదు వెబ్ సిరీస్‌లో కూడా రాజా యాక్టర్‌గా ప్రూవ్ చేసుకున్నాడు. ఆహాలో విడుదలయిన 'మస్తీస్' అనే సిరీస్‌లో రాజా ఓ కీలక పాత్రలో నటించి మెప్పించాడు. ప్రస్తుతం ఒక బిజీ క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా తన కెరీర్‌ను గడిపేస్తున్నాడు.

Tags

Next Story