sirivennela seetharama sastry: సీతారామశాస్త్రి 60 పల్లవులు రాసింది ఈ పాట కోసమే..
sirivennela seetharama sastry: సిరివెన్నెల సీతారామశాస్త్రి మరణం నిస్సందేహంగా సాహిత్య ప్రపంచానికే ఓ తీరని లోటు. ఒక పాటను ఎలా రాయాలి.. ఎలా రాస్తే వారికి నచ్చుతుంది.. అసలు ఈ సందర్భంలో ఈ పదం ఉపయోగించవచ్చా అని ఆలోచించడంలో సీతారామశాస్త్రికి ఎవరూ సాటి రాలేరు. కానీ అలాంటి సీతారామశాస్త్రి కూడా ఒక పాట రాయడంలో ఇబ్బంది పడ్డారట.
సాహిత్యం అంటే మాటలు కాదు.. మన మాటలను, రాసే ప్రతీ అక్షరాన్ని వినేవారు, చదివే వారు ఫీల్ అయ్యేలా చేయగలగాలి. అలాంటి పాటలు రాసేవారిలో సీతారామశాస్త్రి ఎప్పుడూ ముందుంటారు. కానీ ఆయన కూడా అప్పుడప్పుడు మాటలను వెతుక్కోవడంలో ఇబ్బంది పడతారు. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే చెప్పారు.
సీతారామశాస్త్రి రాసిన ఎన్నో వేల ఆణిముత్యాల్లాంటి పాటల్లో 'నువ్వు నాకు నచ్చావ్' సినిమాలోని ' ఒక్కసారి చెప్పలేవా' పాట కూడా ఒకటి. ఒక అబ్బాయి ప్రేమ కోసం అమ్మాయి పరితపించి పాడే పాట ఇది. అయితే ఈ పాట కోసం సీతారామశాస్త్రి ఏకంగా 60 పల్లవులు రాసారాట. కానీ ఏదీ ఆయనకు తృప్తిని ఇవ్వలేదు. చివరికి ముందు రాసిన పల్లవినే ఫైనల్ చేశారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com